WPL 2025: సొంత గడ్డపై ఆర్సీబీ హ్యాట్రిక్ పరాజయాలు.. టోర్నీ నుంచి ఔట్!
మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. వరుసగా మూడు ఓటములతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. గురువారం (ఫిబ్రవరి 28) రాత్రి గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్మృతి మంధాన మరోసారి నిరాశపరచగా, ఎల్లీస్ పెర్రీ డకౌట్ అయింది. ఆ తర్వాత గుజరాత్ ప్లేయర్ ఆష్లే గార్డ్నర్ 58 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఓటమితో, RCB సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టుకు చాలా పేలవమైన ఆరంభం లభించింది. గుజరాత్ ప్లేయర్ డయాండ్రా డాటిన్ మొదటి ఓవర్లోనే డానీ వ్యాట్ హాడ్జ్‌ను అవుట్ చేసింది. దీని తర్వాత, గుజరాత్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ ఆర్‌సిబి కీ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీని డకౌట్ చేసింది. ఇక వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసిన కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ లోనూ కేవలం 10 పరుగులకే వెనుదిరిగింది. ఆర్‌సిబి తరఫున ఒంటరి పోరాటం చేసిన కనికా అహుజా 28 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసింది. వీరితో పాటు, రాఘవి బిష్ట్ 22 పరుగులు, రిచా ఘోష్ తొమ్మిది పరుగులు, కిమ్ గార్త్ 14 పరుగులు చేశారు. జార్జియా వేర్‌హామ్ 20, స్నేహా రాణా 1 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ తరఫున డయాంద్ర డాటిన్, తనూజ కన్వర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ఆష్లీ గార్డ్నర్, కాశ్వీ గౌతమ్ చెరో వికెట్ తీశారు.
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ కు కూడా ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కానీ జట్టు కెప్టెన్ ఆష్లే గార్డనర్ అద్భుతమైన ప్రదర్శనతో కోలుకుంది. గార్డనర్ కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించింది. గార్డనర్ కు మద్దతుగా నిలిచిన ఫోబ్ లిచ్ ఫీల్డ్ 21 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యంతో, బెంగళూరు విధించిన లక్ష్యాన్ని గుజరాత్ 16.3 ఓవర్లలోనే అందుకుంది.
గుజరాత్ గెలుపు సంబరాలు..
Clinical bowling performance 🤝 A captain’s knock#GG get back to winning ways with a dominant 6️⃣-wicket victory👏💪
Scorecard ▶️ https://t.co/G1rjRvSkxu#TATAWPL | #RCBvGG | @Giant_Cricket pic.twitter.com/V0294LMcn6
— Women’s Premier League (WPL) (@wplt20) February 27, 2025
ఇరు జట్ల ప్లేయింగ్-XI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు (ప్లేయింగ్ XI):
స్మృతి మంధాన (కెప్టెన్), డేనియల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాఘవి బిస్ట్, కనికా అహుజా, జార్జియా వేర్‌హమ్, స్నేహ్ రాణా, కిమ్ గార్త్, ప్రేమ రావత్, రేణుకా సింగ్ ఠాకూర్.
గుజరాత్ జెయింట్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI):
బెత్ మూనీ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, దయాలన్ హేమలత, ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), కాశ్వి గౌతమ్, డయాండ్రా డాటిన్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా, భారతి ఫుల్మాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








