RR vs PBKS: రాజస్థాన్-పంజాబ్ పోరులో గెలుపెవరిది.. బెంగళూరు జట్టుకు ఎంత బెనిఫిట్?

Rajasthan Royals vs Punjab Kings: ఐపీఎల్ (IPL 2024) 2024 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇరు జట్లకు ఇది లాంఛనప్రాయ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గెలుపు-ఓటములు RCBతో సహా మరే ఇతర జట్టుపై ప్రభావం చూపకపోవడం విశేషం.

RR vs PBKS: రాజస్థాన్-పంజాబ్ పోరులో గెలుపెవరిది.. బెంగళూరు జట్టుకు ఎంత బెనిఫిట్?
Rajasthan Royals Vs Punjab
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2024 | 5:41 PM

Rajasthan Royals vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 65వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (RR vs PBKS) మధ్య మే 15న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024 నుంచి పంజాబ్ కింగ్స్ ఇప్పటికే నిష్క్రమించింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ టాప్ 2లో నిలిచింది. అస్సాంలో ఈసారి ఐపీఎల్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

రాజస్థాన్ ఫామ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ పాకిస్థాన్‌తో జరగబోయే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చేరడానికి వెళ్లాడు. కాబట్టి అతను లేకుండానే రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. అతని స్థానంలో టామ్ కోహ్లర్-కాడ్మోర్ వచ్చే అవకాశం ఉంది. ఇరు జట్లకు ఇది లాంఛనప్రాయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు-ఓటమి RCBతో సహా మరే ఇతర జట్టుపై ప్రభావం చూపదు.

మరోవైపు లియామ్ లివింగ్‌స్టోన్ సేవలను పంజాబ్ కింగ్స్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకోవడానికి అతను తన దేశానికి తిరిగి వెళ్లాడు. జట్టులోని ఇతర ఇంగ్లండ్ ఆటగాళ్లు, శామ్ కుర్రాన్, జానీ బెయిర్‌స్టో కూడా రాయల్స్‌తో మ్యాచ్ తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్లనున్నారు.

గౌహతిలోని బుర్సపరా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇక్కడ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వర్షం కురిపిస్తుంటారు. ఈ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 4 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు జరగ్గా, రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 198 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు 167 పరుగులుగా నిలిచింది.

పంజాబ్ కింగ్స్: సామ్ కుర్రాన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికిందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భత్రియా , విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలే రూసో.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కృనాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బెర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ర్యాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మీర్ రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కెడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యస్సవి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొట్యాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..