- Telugu News Photo Gallery Cricket photos 1000 sixes completed in just 57 matches in this IPL 2024 season check records
IPL 2024: వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. సిక్సర్ల సునామీలో కూలిపోతున్న పాత రికార్డులు..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి సీజన్‌లో కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 622లుగా రికార్డులకు ఎక్కింది. అయితే, ఆ తర్వాత IPL 2022లో మొదటిసారిగా మొత్తం సిక్సర్ల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది. కానీ, ఈ ఐపీఎల్‌లో ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి.
Updated on: May 15, 2024 | 5:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 సిక్సర్లతో మార్మోగిపోతోంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన సీజన్ ఐపీఎల్ 2024గా నిలిచింది.

అలాగే, ఈసారి ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఐపీఎల్ 2023లో 67 మ్యాచ్‌ల్లో 1000 సిక్సర్లు బాదేశారు. కానీ ఈ ఐపీఎల్‌లో కేవలం 57 మ్యాచ్‌ల్లోనే 1000 సిక్సర్లు పూర్తి చేశారు.

అలాగే, ఐపీఎల్ 2023లో 1000 సిక్సర్లు కొట్టేందుకు బ్యాట్స్‌మెన్ తీసుకున్న మొత్తం బంతుల సంఖ్య 15,391లుగా నిలిచింది. కానీ, ఈసారి 13,079 బంతుల్లో 1000 సిక్సర్లు కొట్టారు.

64 మ్యాచ్‌లు ముగిసే సమయానికి 1125 సిక్సర్లు కొట్టారు. దీంతో పాటు ఐపీఎల్ సీజన్-17 ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఐపీఎల్ 2023 అత్యధిక సిక్సర్లు కొట్టిన సీజన్‌గా నిలిచింది.

గత ఐపీఎల్‌లో 74 మ్యాచ్‌ల్లో మొత్తం 1124 సిక్సర్లు నమోదయ్యాయి. కానీ, ఈ ఐపీఎల్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు ముగిసే సమయానికి మొత్తం 1125 సిక్సర్లు కొట్టారు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఎడిషన్‌గా నిలిచింది.




