RR vs MI, IPL 2024: ‘శత’క్కొట్టిన జైస్వాల్.. ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం?
Rajasthan Royals vs Mumbai Indians: ఐపీఎల్ 17వ సీజన్ 38వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి రాజస్థాన్‌కు 180 పరుగుల టార్గెట్ ను విసిరింది. దీనిని రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్, 9 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో వీరవిహారం చేశాడు. బట్లర్ (35), శాంసన్ (38 నాటౌట్) […]
Rajasthan Royals vs Mumbai Indians: ఐపీఎల్ 17వ సీజన్ 38వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి రాజస్థాన్‌కు 180 పరుగుల టార్గెట్ ను విసిరింది. దీనిని రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్, 9 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో వీరవిహారం చేశాడు. బట్లర్ (35), శాంసన్ (38 నాటౌట్) రాణించారు. కాగా ఈ టోర్నీలో రాజస్థాన్‌కు ఏడో విజయం. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు ఐదో మ్యాచుల్లో ఓటమి పాలైన ముంబై నాకౌట్ ఛాన్స్ లను సంక్లిష్టం చేసుకుంది.
అంతకు ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. రోహిత్ శర్మ 6, ఇషాన్ కిషన్ 0, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ తర్వాత మహ్మద్ నబీ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ముంబై 52 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ, నెహాల్ వాద్రా ఐదో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం ముంబై ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చింది. ఆ తర్వాత 49 పరుగుల వద్ద నెహాల్ వాద్రా అవుటయ్యాడు. నేహాల్ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా తిలక్ వర్మ అత్యధికంగా 65 పరుగులు చేయడంతో ముంబై గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్..
THAT 💯 moment! ☺️
Jaipur is treated with a Jaiswal special! 💗
Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI
— IndianPremierLeague (@IPL) April 22, 2024
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ మరియు యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్లు :
జోస్ బట్లర్, కేశవ్ మహారాజ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వాద్రా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా మరియు జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్లు :
నువాన్ తుషార, ఆకాష్ మధ్వల్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..