T20 World Cup 2024: టీమిండియా కోచ్‌గా మళ్లీ రాహుల్ ద్రవిడ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ది వాల్
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తమ పోరాటాన్ని జూన్ 5న ప్రారంభించనుంది. బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది. అలాగే జూన్ 9న జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు .

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తమ పోరాటాన్ని జూన్ 5న ప్రారంభించనుంది. బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది. అలాగే జూన్ 9న జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు . సోమవారం విలేకరుల సమావేశంలో ద్రావిడ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచకప్‌తో తన పదవీకాలం ముగియనుందని, అయితే తాను మళ్లీ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనని ధృవీకరించాడు. దీంతో పాటు ఈ టీ20 ప్రపంచకప్‌తో టీమిండియాతో రాహుల్ ద్రవిడ్ అనుబంధానికి తెరపడనుంది. నవంబర్ 2021లో ద్రవిడ్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత టీం ఇండియా ఎన్నో సిరీస్‌లను కైవసం చేసుకుంది. అయితే ఐసీసీ టోర్నీని గెలవలేకపోయింది.
రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో భారత జట్టు 2022లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది. అలాగే 2023లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడనుంది. కానీ టీం ఇండియా ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ టీ20 ప్రపంచకప్‌తో రాహుల్ ద్రవిడ్ కోచ్ కెరీర్ ముగియనుంది. ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడానికి ఇదే చివరి అవకాశం. అందుకు తగ్గట్టుగానే టీ20 ప్రపంచకప్ తోనైనా టీమిండియా ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ కు వీడ్కోలు పలుకుతారేమో వేచి చూడాలి.
టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు..
• గ్రూప్ A – భారతదేశం, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్‌ఏ
• గ్రూప్ B – ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
• గ్రూప్ C – న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, ఉగాండా
• గ్రూప్ D – దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
టీమిండియా గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్..
• జూన్ 5 – ఇండియా vs ఐర్లాండ్ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు
• జూన్ 9 – ఇండియా vs పాకిస్తాన్ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు
• జూన్ 12 – ఇండియా vs యూఏస్‌ఏ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు
• జూన్ 15 – ఇండియా vs కెనడా – ఫ్లోరిడా – రాత్రి 8 గంటలు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
రిజర్వ్‌లు:
శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




