14 ఫోర్లతో 102 రన్స్‌..150 స్ట్రైక్‌ రేట్‌తో బౌలర్లకు చుక్కలు.. అచ్చం సూర్య కుమార్‌ను తలపించేలా ధనాధన్‌ షాట్లు

కీపర్‌ తల మీదుగా ఆడే రివర్స్ స్వీప్ షాట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో బాగా పాపులర్ అయింది. ఎంతో కచ్చితత్వంతో ఆడితే కానీ ఈ షాట్‌ను ఆడలేం. అలాంటిది అలవోకగా స్కూప్ షాట్లు ఆడుతూ బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటాడు సూర్య.

14 ఫోర్లతో 102 రన్స్‌..150 స్ట్రైక్‌ రేట్‌తో బౌలర్లకు చుక్కలు.. అచ్చం సూర్య కుమార్‌ను తలపించేలా ధనాధన్‌ షాట్లు
Muneeba Ali
Follow us
Basha Shek

|

Updated on: Feb 18, 2023 | 9:08 AM

టీ20ల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. 360 డిగ్రీస్‌లో నలు దిక్కులా అతను ఆడే ధనాధన్‌ షాట్లు ఫ్యాన్స్‌ను ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా కీపర్‌ తల మీదుగా ఆడే రివర్స్ స్వీప్ షాట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌లో బాగా పాపులర్ అయింది. ఎంతో కచ్చితత్వంతో ఆడితే కానీ ఈ షాట్‌ను ఆడలేం. అలాంటిది అలవోకగా స్కూప్ షాట్లు ఆడుతూ బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటాడు సూర్య. చాలామంది స్టార్‌ క్రికెటర్లు ఈ షాట్‌ను అనుసరించేందుకు ట్రై చేస్తున్నారు కానీ సక్సెస్‌ అవ్వట్లేదు. అయితే ఒక మహిళా క్రికెటర్‌ మాత్రం  సూర్య కుమార్ షాట్‌ను సూపర్‌గా ఆడేసింది. బంతిని నేరుగా బౌండరీకి తరలించింది. ఆమె మరెవరో కాదు పాకిస్తాన్ బ్యాటర్‌ మునీబా. తాజాగా పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్‌తో తలపడింది. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాక్ జట్టుకు ఈ మ్యాచ్‌లో భారీ విజయం అవసరం. ఈ క్రమంలో మునిబా అలీ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా ఆ జట్టు 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా టోర్నీలో మొదటి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మునిబా బ్యాటింగ్‌ పలువురి ప్రశంసలు అందుకుంది.

ఈ మ్యాచ్‌లో మునిబా అలీ 102 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఆమె బ్యాటింగ్ అభిమానులను ఎంతగానో అలరించింది. అయితే ఈ సెంచరీ ఇన్నింగ్స్‌ లో ఆమె ఆడిన ఒక షాట్‌ అచ్చం టీమిండియా స్టార్ ప్లేయర్‌ సూర్యకుమార్‌ను గుర్తుచేసింది. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఐరిష్ ఆల్ రౌండర్ లారా డెలానీ వేసిన బంతిని కాస్త క్రీజు బయటకు వెళ్లి లెగ్‌ సెడ్‌ వైపు స్కూప్‌ సాట్ ఆడింది. దీంతో బంతి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది. ఈ షాట్‌ను సూర్యకుమార్ యాదవ్ స్కూప్‌ షాట్‌తో పోల్చుతూ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది ఐసీసీ. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 168 పరుగులు చేసింది. మునిబా 102 పరుగులతో పాటు నిదా దార్ కూడా 33 పరుగులు చేసింది. ఆ తర్వాత ఐరిష్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేక 16.3 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. పాక్‌ బౌలర్‌ నష్రూ సంధు తన 4 ఓవర్ల స్పెల్‌లో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు నేలకూల్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?