Javed Miandad: క్షీణించిన దిగ్గజ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స.. వీడియో సందేశం పంపిన మియాందాద్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, కోచ్ జావేద్ మియాందాద్ ఆరోగ్యం క్షీణించడంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, కోచ్ జావేద్ మియాందాద్ ఆరోగ్యం క్షీణించడంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు ఈ వార్త తెలియగానే ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయనకేమైంది అంటూ నెట్టంట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈక్రమంలో తన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను ఖండించాడు మియాందాద్. తన ట్వి్ట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని చూసి నా ఫ్యాన్స్ కలత చెందుతున్నారని తెలిసింది. అయితే నా ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ పుకార్లే. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంచెం తలనొప్పిగా ఉండడంతో రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చాను. నేను క్షేమంగా ఉన్నాను. ఒక అరగంటలో ఇంటికి వెళ్తాను’ అని తన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను కొట్టి పారేశాడీ లెజెండరీ క్రికెటర్.
పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ల జాబితాలో మియాందాద్ కూడా ఒకరు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో ప్రపంచకప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో అతను సభ్యుడు. జావేద్ మియాందాద్ పాక్ తరఫున 124 టెస్టు మ్యాచ్‌లు ఆడి 52.57 సగటుతో 8832 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 233 వన్డే మ్యాచ్‌ల్లో 41.70 సగటుతో 7381 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మియాందాద్ కొంత కాలం పాటు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గానూ, కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
Thank you for the prayers. Please continue to remember me and my family in prayer. pic.twitter.com/F3PTOj4AcD
— Javed Miandad (@Javed__Miandad) February 17, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..