AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NZ: 18 ఏళ్ల హిస్టరీ రిపీట్.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు బలైన పాకిస్తాన్ టీం.. అదేంటంటే?

PAK vs NZ 1st Test: ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా పాకిస్థాన్ తన స్వదేశంలో వరుసగా ఐదో ఓటమిని తప్పించుకుంది. అంతకుముందు స్వదేశంలో ఆ జట్టు వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

PAK vs NZ: 18 ఏళ్ల హిస్టరీ రిపీట్.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు బలైన పాకిస్తాన్ టీం.. అదేంటంటే?
Pakistan Team Fined 5 Penalty Runs The Ball It Sarfaraz Ahmed Helmet
Venkata Chari
|

Updated on: Dec 31, 2022 | 6:05 AM

Share

PAK vs NZ 1st Test: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెస్టు క్రికెట్‌లో 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఫీట్ ఈ మ్యాచ్‌లో జరిగింది. ఇందులో పాకిస్థాన్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు పరుగుల పెనాల్టీ పడింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో కివీ జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు పరుగుల పెనాల్టీని పొందింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంతి పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ హెల్మెట్‌కు తగిలింది. ఈ విధంగా న్యూజిలాండ్ రెండు ఇన్నింగ్స్‌లలో 5 పరుగుల పెనాల్టీని అందుకుంది.

18 సంవత్సరాల క్రితం..

ఇంతకు ముందు 2004లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలిన తర్వాత బంతి బయటకు వచ్చింది. టెస్ట్ క్రికెట్‌లో 18 ఏళ్ల తర్వాత మరోసారి ఇలా జరిగింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగలడంతో జట్టుకు 5 పరుగుల పెనాల్టీ పడింది.

4 ఏళ్ల తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ రీ ఎంట్రీ..

న్యూజిలాండ్‌తో జరిగిన ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ సుమారు నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్ల సాయంతో 86 పరుగులు జోడించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు కొట్టి 53 పరుగులు చేశాడు. సర్ఫరాజ్‌కి ఇది 50వ టెస్టు మ్యాచ్. అంతకుముందు, అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను జనవరి 11, 2019న దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

స్వదేశంలో వరుసగా ఐదో టెస్ట్‌ను డ్రా చేసుకున్న పాక్..

ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా పాకిస్థాన్ తన స్వదేశంలో వరుసగా ఐదో ఓటమిని తప్పించుకుంది. అంతకుముందు స్వదేశంలో ఆ జట్టు వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..