Watch Video: ఇదేంది బాస్ ఇలా ఔటయ్యావ్.. మరీ ఇంత విచిత్రంగానా.. నెట్టింట వైరల్ వీడియో..

Big Bash League 2022-23: బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ లీత్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు.

Watch Video: ఇదేంది బాస్ ఇలా ఔటయ్యావ్..  మరీ ఇంత విచిత్రంగానా.. నెట్టింట వైరల్ వీడియో..
Cricket Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 31, 2022 | 7:02 AM

Trending Video: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2022-23లో, మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ లిత్ చాలా ప్రత్యేకమైన రీతిలో ఔటయ్యాడు. బ్యాటింగ్ సమయంలో ఆడమ్ తన తప్పిదానికి విచిత్రమైన రీతిలో పెవిలియన్ చేరాడు. ఎండీ లీత్‌ పెవిలియన్ చేరిన వీడియోను బిగ్ బాష్ లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆడమ్ లిత్ వికెట్ ఎలా పడిందంటే..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ మార్కస్ స్టోయినిస్ ఆడమ్ లిత్‌ను ఔట్ చేయడాన్ని మీరు చూడొచ్చు. మార్కస్ స్టోయినిస్ వేసిన బంతి మొదట ఆడమ్ లీత్ పైభాగాన్ని తాకింది. ఆ తర్వాత లిత్ దగ్గర బంతి కాసేపు ఆగింది. లిత్ టర్న్ చేయగానే బంతి బయటకు వచ్చి స్టంప్‌లకు తగలడంతో బెయిల్స్ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి.

ఇవి కూడా చదవండి

తన వికెట్ కోల్పోయిన తర్వాత, లిత్ మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అతను కూడా కొంత నిరాశకు గురయ్యాడు. లీత్ తన ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో అతను 3 ఫోర్లు కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టోయినిస్‌ తన రెండో బంతికే లీత్‌ వికెట్‌ పడగొట్టాడు. స్టోయినిస్ తన స్పెల్ రెండవ ఓవర్ విసిరాడు.

ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ విజయం..

డిసెంబర్ 29, గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పరుగుల లక్ష్యాన్ని పెర్త్ స్కార్చర్స్ 17.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇందులో కెప్టెన్ ఆష్టన్ టర్నర్ 26 బంతుల్లో 53 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..