AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: పాక్, కివీస్ తొలి టెస్ట్ డ్రా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు?

పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్ డ్రా అయిన తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో..

WTC Points Table: పాక్, కివీస్ తొలి టెస్ట్ డ్రా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు?
Pakistan Vs New Zealand
Venkata Chari
|

Updated on: Dec 31, 2022 | 2:48 AM

Share

WTC Points Table: పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్ డ్రా అయిన తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ రెండు జట్లు ఇప్పుడు ఫైనల్ రేసుకు దూరంగా ఉన్నాయి. కాబట్టి, ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్ ఫైనల్‌పై ఎటువంటి ప్రభావం చూపదు. పాయింట్ టేబుల్ తాజా పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల స్థానం..

ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ ఆరో, చివరి సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఆరింటిలో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పాకిస్తాన్ మొత్తం 60 పాయింట్లు సాధించింది. కానీ, పాకిస్తాన్ స్కోరు శాతం 38.46గా ఉంది. టేబుల్‌‌లో ఏడో స్థానంలో నిలిచింది. టెస్టు ఛాంపియన్‌షిప్ తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఐదో సిరీస్‌ను ఆడుతోంది. కివీస్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆరింటిలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. న్యూజిలాండ్ టీం మొత్తం 32 పాయింట్లు పొందింది. న్యూజిలాండ్ మార్కుల శాతం 26.67గా నిలిచింది. కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య ఫైనల్..

ఐదో సిరీస్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా ఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. కంగారూ జట్టు 10 మ్యాచ్‌లు గెలిచి ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. 78.57 పాయింట్ల శాతంతో ఆస్ట్రేలియా తదుపరి ఐదు టెస్టుల్లో ఒకదానిలోనైనా గెలిచినా లేదా డ్రా అయినా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. భారత జట్టు కూడా ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐదు సిరీస్‌ల్లో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచిన భారత్ నాలుగింటిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియా 58.93 శాతం మార్కులు వచ్చాయి. దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించంతో ఆసీస్ టీంకు బాగా కలిసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్