PAK vs ENG 1st Test: ముల్తాన్‌లో పాక్ ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. 147 ఏళ్లలో తొలిసారి చెత్త రికార్డ్
Pakistan vs England, 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, టెస్టు చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. శుక్రవారం ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ధీటుగా స్పందించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లకు 823 లకు డిక్లెర్ చేసింది.
Pakistan vs England, 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, టెస్టు చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. శుక్రవారం ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ధీటుగా స్పందించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లకు 823 లకు డిక్లెర్ చేసింది.
267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 220 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో స్వదేశంలో మరో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆడిన చివరి 11 టెస్టుల్లో ఏడు పరాజయాలతో పాకిస్థాన్ చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మైదానంలో అక్టోబర్ 15 నుంచి సిరీస్‌లో రెండో టెస్టు జరగనుంది.
పాక్ జట్టు పేరుతో నమోదైన చెత్త రికార్డులు..
- టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500+ పరుగులు చేసి ఓడిపోయింది.
- గత 44 నెలలుగా పాకిస్థాన్ ఏ టెస్టు మ్యాచ్‌లోనూ గెలవలేదు.
పాకిస్థాన్ క్రికెట్‌కు అత్యంత అవమానకరమైన రోజు..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను చాలా అద్భుతంగా ప్రారంభించింది. మ్యాచ్‌లో తొలి మూడున్నర రోజులు ఆట డ్రాగా సాగినా.. నాలుగో రోజు చివరి సెషన్ నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. దీంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తర్వాత కూడా టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఇరు జట్లు:
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్(కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, అమీర్ జమాల్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్(కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, జాక్ లీచ్, షోయబ్ బషీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..