IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?
India vs Pakistan: పాకిస్తాన్ రోజుకో వింత ప్రకటనతో తలనొప్పిలా తయారైంది. బంగ్లాకు మద్దుతుగా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామని ఓసారి, భారత జట్టుతో మ్యాచ్ ఆడమని మరోసారి ఇలా చెత్త పుకార్లను వ్యాప్తి చేస్తోంది. ఇప్పటికే ఐసీసీ నుంచి వార్నింగ్ అందుకున్న పాకిస్తాన్ జట్టు.. తాజా నిర్ణయంతో మరోసారి టీ20 ప్రపంచకప్ వాతావారణాన్ని హీటెక్కించింది.

India vs Pakistan: మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లతో సిద్ధమయ్యాయి. అయితే, బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన జట్టు వింత ప్రకటనలతో టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే బంగ్లాకు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పుకార్లు రేకెత్తించడం, ఆపై ఐసీసీ హెచ్చరించడంతో కామ్‌గా స్వ్కాడ్‌ను ప్రకటించింది. ఆ తర్వాత మరో కొత్త డ్రామకు తెరలేపింది.
భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పుకార్లు..
ఇప్పటికే బంగ్లాకు మద్దతు పలికి తలనొప్పులు తెచ్చుకున్న పాక్ జట్టు.. ఇప్పుడు సరికొత్త డ్రామకు ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 15న భారత జట్టుతో జరగబోయే మ్యాచ్ నుంచి తప్పుకుంటామని, ఆ మ్యాచ్‌ను బహిష్కరించే ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల మేరకు పీసీబీ చెర్మన్ మొహ్సిన్ నఖ్వీతోపాటు పాక్ ప్రధాని సాబాజ్ షరీఫ్ జరపబోయే సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. బంగ్లాకు మద్దతు తెలిపేందుకే ఇలాంటి నిర్ణయానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ఎవరొచ్చారంటే?
భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే..?
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే, పాకిస్తాన్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటే, ఐసీసీకి భారీగా ఆర్థిక నష్టం కలగనుంది. ఎందుకంటే, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ నుంచే ఐసీసీకి భారీగా డబ్బులు సమకూరనున్నాయి. టీ20 ప్రపంచకప్ ఫైనల్, సెమీస్ కంటే కూడా ఈ రెండు జట్లు ఢీ కొనబోయే మ్యాచ్‌లకే భారీగా రేటింగ్ రానుంది. దీనిని ఐసీసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి ఇలాంటి మ్యాచ్ విషయంలో పాక్ నిర్ణయంతో ఐసీసీ తీవ్రంగా పరిగణించే ఛాన్స్ ఉంది. కఠిన చర్యలు తీసుకోవచ్చు అని తెలుస్తోంది.
IND vs NZ, 3rd T20I: 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల వింత వైఖరి..
🔥Bang 🔥 🚨 PAKISTAN vs INDIA BOYCOTT 🚨
Pakistan is most likely to boycott the India game on 15th Feb in the T20 World Cup. (Geo News).#T20WC2026 #PakistanCricket #T20WorldCup2026 pic.twitter.com/0JhtqyMxRL
— Talha Nawaz (@TalhaDigital007) January 26, 2026
బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్నప్పటి నుంచి పీసీబీతోపాటు పాక్ మాజీ ఆటగాళ్లు వింత ప్రకటనలతో వివాదాలు సృష్టిస్తున్నారు. బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలని మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ సూచించాడు. పాక్ జట్టు తప్పుకుంటే, ఐసీసీతో పాటు భారత్‌కు భారీ నష్టమంటూ తెలిపాడు. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ టీం భారత్‌తో మ్యాచ్ నుంచి తప్పుకోవాలని వార్తలు వినిపిస్తున్నాయి. షాబాజ్, మొహ్సిన్ నఖ్వీల మధ్య సమావేశం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.




