IND vs NZ, 3rd T20I: 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
Abhishek Sharma hits fifty in 14 balls: గువహటి వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.

Ind Vs Nz 3rd T20i Abhishek Sharma Fifty
Abhishek Sharma hits fifty in 14 balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఇది రికార్డుల్లోకెక్కింది.
యువరాజ్ సింగ్ రికార్డు.. ఈ జాబితాలో టీమ్ ఇండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ కేవలం 12 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లోనే స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడంతో, యువరాజ్ తర్వాత అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
