Video: నీ బ్యాడ్ లక్ తగలెయ్యా.. పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో విఫలం.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్?
గత 3 మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకోవడం సంజు భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది.

భారత జట్టులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్లలో సంజు శాంసన్ కూడా ఒకడు. ఒకానొక సమయంలో టీమిండియాలో ఛాన్స్‌లు రాకపోవడంతో అభిమానులే బీసీసీఐ విమర్శలు గుప్పించారు. బీసీసీఐపై తీవ్ర వ్యతిరేకత కూడా చూపించారు. కానీ, అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం సంజూ శాంసన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తాజాగా మరోసారి అదే చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో సంజుకు ఓపెనర్‌గా అద్భుతమైన అవకాశం దక్కింది. కానీ, గువహటి వేదికగా జరిగిన 3వ టీ20లో సంజు శాంసన్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వరుస అవకాశాలు.. వరుస వైఫల్యాలు..
Shubman Gill be like :-
“Kaash meko bhi wicketkeeping aati toh is Macrohard ki tarah team mai hota”
Anyone who celebrated Gill getting replaced by Samson is a ret@rd.
He is eating place of Yashasvi Jaiswal#ShubmanGill #SanjuSamson #T20WorldCup2026pic.twitter.com/xAp8L8WwXt
— Prateek (@prateek_295) January 25, 2026
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, కివీస్‌ను 153 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేజింగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్, ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ పారేసుకున్నాడు. మరోసారి సంజు బాధ్యతారాహిత్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పొగిడిన అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కెరీర్ ప్రమాదంలో పడిందా?
గత 3 మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకోవడం సంజు భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది.
రెండవ టీ20లో 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన శాంసన్, తొలి మ్యాచ్‌లో 7 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 3 మ్యాచ్‌ల్లో 16 పరుగులు మాత్రేమే చేసి వచ్చిన చక్కని అవకాశాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు.
ఈ డకౌట్‌తో టీమిండియా తరపున ఇప్పటివరకు ఆడిన 55 T20Iలలో అతనికి 7వసారి జీరోకే పెవిలియన్ చేరాడు.
భారత్ తరపున టీ20ల్లో సంజు కంటే రోహిత్ శర్మ మాత్రమే ఎక్కువసార్లు డకౌట్లు అయ్యాడు. 2024లో భారత్‌ను టీ20 ప్రపంచ కప్ టైటిల్ విజయానికి నడిపించిన రోహిత్, 2007 నుంచి 2024 వరకు భారతదేశం తరపున ఆడిన 159 టీ20 మ్యాచ్‌ల్లో 12 మ్యాచ్‌ల్లో ఖాతా తెరవలేకపోయాడు.
