AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఇప్పటికైనా మారు లేకపోతే మరో పృథ్వీ షా అవుతావు! RR యంగ్ ఓపెనర్ కి పాక్ క్రికెటర్ ఓపెన్ మెసేజ్

ఐపీఎల్ 2025లో యశస్వి జైశ్వాల్ ఫామ్ కోల్పోవడం అభిమానులను నిరాశపరిచింది. పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ, యశస్వికి పృథ్వీ షా మాదిరిగానే కెరీర్ నాశనమవుతుందంటూ హెచ్చరించారు. ఆటపై ఆసక్తి, ప్యాషన్ లేకుండా ఆడితే మిగిలేది గుర్తింపు కాదని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ విఫలమవడం జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

IPL 2025: ఇప్పటికైనా మారు లేకపోతే మరో పృథ్వీ షా అవుతావు! RR యంగ్ ఓపెనర్ కి పాక్ క్రికెటర్ ఓపెన్ మెసేజ్
Jaiswal
Narsimha
|

Updated on: Apr 11, 2025 | 11:00 AM

Share

ఐపీఎల్ 2025 సీజన్ సాగుతున్న కొద్దీ కొన్ని యువ క్రికెటర్లు తమ ఫామ్‌తో నిరాశపరిచారు. వారిలో ఒకరు భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్. కెరీర్ ప్రారంభంలోనే మెరుపులు మెరిపించి, టీమిండియాకు భవిష్యత్తు ఓపెనర్‌గా గుర్తింపు పొందిన అతను, ప్రస్తుతం మాత్రం తను చూపాల్సిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక పోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2025లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసి నిరాశపరిచిన యశస్వి, నాలుగో మ్యాచ్‌లో 67 పరుగులతో కాస్త పునరాగమనం చేశాడనిపించినా, ఐదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై మళ్లీ కేవలం 6 పరుగులకే ఔట్ కావడం అతని ఆటతీరు పట్ల సందేహాలు కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ యశస్విపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అతడి కడుపు నిండిపోయింది. ఇప్పుడు క్రికెట్‌పై అతనికి ఆసక్తి లేకపోయేలా కనిపిస్తోంది. ఇది నా ఓపెన్ మెసేజ్. ఇప్పుడే అతను మారాలి. లేదంటే, పృథ్వీ షా పరిస్థితి అతనికీ ఎదురవుతుంది. క్రికెట్‌ను ప్రేమించు. ప్యాషన్‌తో ఆడు” అంటూ బాసిత్ గట్టి హెచ్చరికలు చేశారు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే, టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇటీవల అంతర్జాతీయ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం గురించి కూడా బాసిత్ స్పందించారు. “వీరు టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచాక రిటైర్ అవ్వడం సరైన నిర్ణయం. భారత్‌లో ఇప్పటికే చాలా మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారు. వారి కోసం ఈ స్థలాలు ఖాళీ అవడం అవసరం. అయితే కోహ్లీ అంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను ఊహించలేదు. అయినా, అది సరైన నిర్ణయమే” అని అన్నారు.

రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత పరిస్థితి కూడా అంతగా మెరుగుగా లేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. జట్టులో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫామ్ లో లేకపోవడం, టాపార్డర్ విఫలం కావడం జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అతను తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తన ఆటపై, తన దృక్పథంపై మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా అతను పఠనం తీసుకుని మారకపోతే, ప్రతిభ ఉండీ వెలుగులోకి రాని మరో యువ టాలెంట్‌గా మిగిలిపోతాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?