World Cup 2023: బాబర్ సేనకు దెబ్బ మీద దెబ్బ.. వన్డే ప్రపంచకప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. కారణం ఏంటంటే?
Pakistan Cricket Team: వన్డే ప్రపంచకప్ ద్వారా భారత్‌పై జరిగిన ఆసియా కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాక్ జట్టుకు నసీమ్ షా అందుబాటులో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ తగిలిస్తుందనడంలో సందేహం లేదు. ఒకవేళ నసీమ్ షా వన్డే ప్రపంచకప్‌నకు దూరమైతే జమాన్ ఖాన్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన జమాన్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.

Pakistan Cricket Team: ఆసియా కప్ 2023లో ఘోర పరాజయం నుంచి తేరుకోకముందే పాకిస్తాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. అది కూడా వన్డే ప్రపంచకప్ టోర్నీ నుంచి కీలక బౌలర్ నసీమ్ షా ఔట్ అయ్యాడన్న షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. సోమవారం భారత్‌తో జరిగిన సూపర్-4 దశ మ్యాచ్‌లో నసీమ్ షా భుజానికి గాయమైంది. దీంతో మైదానాన్ని మధ్యలోనే వదిలేశాడు.
దీంతో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఈ యువ పేసర్ కనిపించలేదు. ఇప్పుడు నసీమ్ షా స్కానింగ్ రిపోర్టు రావడంతో భుజం గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని తేలింది. అందువల్ల, ప్రాథమిక వైద్య నివేదిక ప్రకారం, అతను మరింత విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని తెలుస్తోంది.




రిపోర్టుల ప్రకారం కనీసం 2 నెలల పాటు అతను ఫీల్డ్‌కు దూరంగా ఉండాల్సి రావొచ్చని అంటున్నారు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో ఈలోగా కోలుకోవడం అనుమానమేనని తెలుస్తోంది. తద్వారా మొత్తం టోర్నీ నుంచి నసీమ్ షా ఔట్ అవుతాడని సమాచారం.
వన్డే ప్రపంచకప్ ద్వారా భారత్‌పై జరిగిన ఆసియా కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాక్ జట్టుకు నసీమ్ షా అందుబాటులో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ తగిలిస్తుందనడంలో సందేహం లేదు.
జమాన్ ఖాన్‌కు అవకాశం..
View this post on Instagram
ఒకవేళ నసీమ్ షా వన్డే ప్రపంచకప్‌నకు దూరమైతే జమాన్ ఖాన్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన జమాన్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. శ్రీలంకపై 8 పరుగుల లక్ష్యాన్ని కూడా చివరి బంతి వరకు నియంత్రించగలిగాడు. అందువల్ల తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన జమాన్ ఖాన్‌కు వన్డే ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది.
పాకిస్థాన్ ప్రపంచ కప్ ప్రయాణం..
అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాకిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అలాగే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి.
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




