ENG vs NZ: క్రికెటర్లను వెంటాడుతోన్న కరోనా.. వైరస్ బారిన పడ్డ మరో ఆటగాడు..
Michael Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ ప్రకంపనలు రేపుతోంది కరోనా. శాంతించిందనుకుంటున్న ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో క్రికెటర్లు వరుసగా ఈ వైరస్ బారిన పడుతున్నారు...
Michael Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ ప్రకంపనలు రేపుతోంది కరోనా. శాంతించిందనుకుంటున్న ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో క్రికెటర్లు వరుసగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మర్‌క్రమ్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కొవిడ్ కోరలకు చిక్కగా.. తాజాగా కివీస్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell) కరోనా బాధితుల జాబితాలో చేరాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కాగా బ్రేస్‌వెల్ రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్- 11లో ఉండడం గమనార్హం. దీంతో న్యూజిలాండ్ జట్టులోని మిగతా వాళ్లందరికీ మేనేజ్ మెంట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌ను నిర్వహించింది. అదృష్టవశాత్తూ ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. అయితే కరోనా వల్ల బ్రేస్‌వెల్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది.
కివీస్‌కు దెబ్బ మీద దెబ్బ..
కాగా ఇప్పటికే మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన న్యూజిలాండ్‌కు ఇది మరో ఎదురుదెబ్బేనని భావించవచ్చు. కరోనా కారణంగా ఆ జట్టు ఇప్పటికే కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. ప్రస్తుతం అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. మరోవైపు రెండో టెస్ట్ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. అతని గాయం చాలా తీవ్రంగానే ఉందని సమాచారం. దీంతో జేమీసన్ కూడా మూడో టెస్ట్ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది. జూన్ 23 గురువారం నుండి లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి, మూడో టెస్ట్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..