IPL 2023: తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోని.. కొత్త రూల్‌తో బరిలోకి చెన్నై టీం.. సారథిగా ఎవరంటే?

GT vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే అతను పూర్తి ఫిట్‌గా లేడని నివేదికలు చెబుతున్నాయి.

IPL 2023: తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోని.. కొత్త రూల్‌తో బరిలోకి చెన్నై టీం.. సారథిగా ఎవరంటే?
ఐపీఎల్ 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని 85 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ ఘనతను సాధించినన మొదటి బ్యాటర్‌గా కూడా ధోని నిలిచాడు.
Follow us
Venkata Chari

|

Updated on: Mar 31, 2023 | 3:51 PM

ఐపీఎల్ 2023 ప్రారంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. దానికి ముందు ధోని గురించి పెద్ద ప్రశ్న తలెత్తింది. అసలు ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ధోని ఆడగలడా లేదా అనేది ప్రశ్నగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడతాడా? ధోనీ పూర్తి ఫిట్‌గా లేనందున ఈ ప్రశ్న తలెత్తింది. నివేదికల ప్రకారం చెన్నైలో ప్రాక్టీస్ సమయంలో ధోనీ గాయపడ్డాడు. మోకాలికి స్వల్ప గాయం కావడంతో ఇప్పటి వరకు పూర్తిగా ఫిట్‌గా లేడంట. అయితే మంచి విషయమేమిటంటే, అతను పూర్తి ఫిట్‌గా లేనప్పటికీ, ఈ ఆటగాడు గుజరాత్‌పై ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.

చెన్నై సూపర్‌కింగ్స్ కావాలంటే ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. అంటే ధోని అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ధోని ప్రస్తుతం 80% మాత్రమే ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ ఫిట్‌నెస్‌తో మ్యాచ్ మొత్తం ఆడితే వచ్చే మ్యాచ్‌ల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ నియమం?

IPLలో మొదటిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలు చేయనున్నారు. ఈ నియమం ప్రకారం, ప్లేయింగ్ XI ఆటగాళ్లతో పాటు, కెప్టెన్లు కూడా నలుగురు ఆటగాళ్ల పేర్లను అందజేయవలసి ఉంటుంది. వారిలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా పని చేయగలరు. ఈ ప్లేయర్‌ని 14వ ఓవర్‌లోపు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు చెన్నైకి ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ధోని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..