GT vs CSK Live Score, IPL 2023: చెన్నైకి బిగ్ షాక్.. 5 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం..
Gujarat Titans vs Chennai Super Kings Live Score in Telugu: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 179 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
Gujarat Titans vs Chennai Super Kings Live Score in Telugu: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 179 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సీఎస్‌కే తరపున ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ అత్యధికంగా 92 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మొయిన్ అలీ 23 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలో 2 వికెట్లు తీశారు.
IPL 2023లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. అయితే అంతకు ముందు నిర్వహించిన ప్రారంభోత్సవంలో నటి రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ వంటి స్టార్లు స్టేడియాన్ని షేక్ చేశారు. ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ శుక్రవారం గుజరాత్, చెన్నై మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సాయంత్రం 6 గంటలకు దాదాపు 45 నిమిషాల పాటు ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(w/c), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అజింక్యా రహానే, ప్రశాంత్ సోలంకి, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, తుషార్ దేశ్‌పాండే.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కేఎస్ భరత్, శివమ్ మావి, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్.
Key Events
తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన గైక్వాడ్.. కేవలం 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
ప్రారంభోత్సవంలో నటి రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ వంటి స్టార్లు స్టేడియాన్ని షేక్ చేశారు.
LIVE Cricket Score & Updates
-
CSK Vs GT Live Match: గుజరాత్‌కు బిగ్ షాక్.. పాండ్యా ఔట్..
గుజరాత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ కెప్టెన్ పాండ్యా అవుటయ్యాడు. 12వ ఓవర్ తొలి బంతికి జడేజా బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని స్వీప్ చేసేందుకు పాండ్య ప్రయత్నించగా.. అతి తప్పి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాండ్యా 11 బంతుల్లో 8 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ ప్రస్తుతం 127/3.
-
CSK Vs GT Score Card: రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్‌కు మరో దెబ్బ తగిలింది. గుజరాత్ ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్‌ను రాజ్‌వర్ధన్ అవుట్ చేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి సాయి సుదర్శన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. దాంతో సుదర్శన్ పెవిలియన్ బాట పట్టాడు.
-
-
దంచికొడుతున్న గుజరాత్ ప్లేయర్స్.. 10 ఓవర్లకు 100 రన్స్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా గుజరాత్ టైటాన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లు తలపడుతున్నాయి. 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ప్లేయర్స్ మాంచి ఊపు మీదున్నారు. 10 ఓవర్లకు 100 పరుగులు చేశారు.
-
గుజరాత్ టార్గెట్ 179..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 179 పరుగుల లక్ష్యం ఉంది.
-
గైక్వాడ్ సెంచరీ మిస్..
గైక్వాడ్ 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 17.1 ఓవర్లో జోషఫ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి గిల్ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో 92 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి.
-
-
గాయపడిన విలియమ్సన్..
కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. 13వ ఓవర్ రెండో బంతికి రీతురాజ్ గైక్వాడ్ డీప్ మిడ్ వికెట్ మీద షాట్ ఆడాడు. బంతి సిక్సర్ వెళుతోంది. కానీ అక్కడ నిలబడి ఉన్న కేన్ విలియమ్సన్ డైవింగ్ చేయడం ద్వారా బంతిని అద్భుతంగా ఆపాడు. అయితే ఈ సమయంలో అతని మోకాలికి గాయం కావడంతో విలియమ్సన్ మైదానం వీడాడు.
-
గైక్వాడ్ హాఫ్ సెంచరీ
చెన్నైకి చెందిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్ గుజరాత్ బౌలర్లను చిత్తు చేస్తున్నాడు. భీకరమైన షాట్లు ఆడుతూ.. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
-
5 ఓవర్లు ముగిసే సరికి..
5 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం ఒక వికెట్ కోల్పోయి 46 పరుగులు సాధించింది. గైక్వాడ్ 24, అలీ 19 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
షమీ డేంజరస్ బౌలింగ్..
షమీ అద్బుతంగా బౌలింగ్ చేస్తూ, గుజరాత్ టీంకు తొలి వికెట్‌ను అందించాడు. 2.2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. కాన్వే (1)ను పెవిలియన్ చేర్చాడు.
-
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
ఇంపాక్ట్ ప్లేయర్స్: కేఎస్ భరత్, శివమ్ మావి, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్.
-
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్..
ఇంపాక్ట్ ప్లేయర్స్: అజింక్యా రహానే, ప్రశాంత్ సోలంకి, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, తుషార్ దేశ్‌పాండే.
-
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI)
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.
-
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(w/c), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.
-
టాస్ గెలిచిన గుజరాత్..
గుజరాత్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ధోని సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
ముగిసిన ప్రారంభోత్సవ వేడుక..
బాలీవుడ్ తారల ప్రదర్శన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు రంగంలోకి దిగారు. గత విజేత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రోఫీతో మైదానంలోకి వచ్చాడు.
-
స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన ధోని, హార్దిక్..
పాటలు, డ్యాన్స్‌ల తర్వాత స్టేజ్ పైకి గుజరాత్, చెన్నై టీంల సారథులు హార్దిక్, ధోని ఎంట్రీ ఇచ్చారు.
-
తెలుగు పాటతో దుమ్మురేపిన రష్మిక
తెలుగు పాటలతో రష్మిక ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది.
-
ఎంట్రీ ఇచ్చిన తమన్నా..
అరిజిత్ సింగ్ పాటల ప్రదర్శన తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. తన డ్యాన్స్‌తోె ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
-
అరిజిత్ సింగ్ పాటతో మొదలైన ప్రారంభోత్సవం..
స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ తన పాటల ప్రదర్శనతో ప్రారంభోత్సవాన్ని రంజింపచేస్తున్నాడు.
-
మరికొద్దిసేపట్లో ప్రారంభోత్సవం..
ఐపీఎల్-2023 ప్రారంభ వేడుక మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో తమన్నా భాటియా నుంచి రష్మిక మందన్న, అరిజిత్ సింగ్ వరకు స్టేడియాన్ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
-
Hardik Pandya: కల నెరవేరింది.. అదే మా టార్గెట్: హార్దిక్ పాండ్య..
గత ఐపీఎల్ సీజన్‌లో విజేత నిలిచిన గుజరాత్ టైటాన్స్.. నేడు లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. గతేడాది విజేతగా నిలవడం ఆనందంగా ఉందని, ఆ విజయాలను కొనసాగించేందుకు ట్రై చేస్తామంటూ చెప్పుకొచ్చాడు.
-
IPL 2023 Opening Ceremony Live: ధోనీ తొలి మ్యాచ్ ఆడతాడా?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది తేలలేదు. కాలికి గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడలేడని గతంలో వార్తలు వచ్చాయి. ధోని గాయం ఎంత లోతుగా ఉందో స్పష్టంగా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో మొదటి మ్యాచ్ ఆడతాడా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
-
IPL 2023 Opening Ceremony Live: ప్రాక్టీస్‌లో ఇరగదీసిన ముద్దుగుమ్మలు..
Lights ? Camera ? Action ?⏳@tamannaahspeaks & @iamRashmika are geared up for an exhilarating opening ceremony of #TATAIPL 2023 at the Narendra Modi Stadium ?️? pic.twitter.com/wAiTBUqjG0
— IndianPremierLeague (@IPL) March 30, 2023
-
IPL 2023 Opening Ceremony Live: అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు..
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దీంతో అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. నిన్న సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఈరోజు అహ్మదాబాద్ ఆకాశం నిర్మలంగా ఉండడం, సాయంత్రానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం లేదని తెలుస్తోంది.
-
IPL 2023 Opening Ceremony Live: మందన్న, అరిజిత్ ప్రదర్శన..
ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రష్మిక మందన్న, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా 6 గంటలకు డ్యాన్స్, పాటలతో అలరించనున్నారు.
Published On - Mar 31,2023 4:51 PM