IPL 2023: ఐపీఎల్ 2023 విజేతగా ఆ జట్టే.. ఓపెనింగ్ మ్యాచ్‌తోనే ఫైనల్ విన్నర్ డిసైడ్.. ఇవిగో లెక్కలు..
CSK vs GT: IPL 2023 ప్రారంభ మ్యాచ్‌లో ఈ రోజు (మార్చి 31)న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు కొన్ని ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి.
ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గత విజేత గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు టెన్షన్‌ని తగ్గించే ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 15 సీజన్లలో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిన ఒకే జట్టు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
IPL 2008 నుంచి 2022 వరకు, అంటే ఈ లీగ్ 15 సీజన్లలో 5 సార్లు ఇలా జరిగింది. IPL ప్రారంభ మ్యాచ్‌లో తలపడిన జట్టు మాత్రమే టైటిల్ గెలుచుకుంది. అంటే ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో తలపడే జట్టు నుంచి ట్రోఫీలో మూడో వంతు మాత్రమే వచ్చింది. ఈ 5 ట్రోఫీల్లో మూడు ట్రోఫీలు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిచిన టీం సొంతం చేసుకోగా, ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిన వారి ఖాతాలో రెండు ట్రోఫీలు చేరాయి. ఇది చెన్నై, గుజరాత్ జట్లకు ఉపశమనం కలిగించే అంశం. ఈ రెండు జట్లు IPL 2023 ఛాంపియన్‌లుగా మారే అవకాశాలు 33%గా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రారంభ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్న జట్లు..
IPL 2011, 2014, 2018లో ప్రారంభ మ్యాచ్‌లో గెలిచిన జట్టు IPL ఫైనల్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. IPL 2011లో, CSK టీం KKRని 2 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో RCBని ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. IPL 2014 తొలి మ్యాచ్‌లో KKR 41 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. తరువాత, KKR జట్టు ఫైనల్లో కింగ్స్ XI పంజాబ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అదేవిధంగా, IPL 2018 ప్రారంభ మ్యాచ్‌లో, CSK ఒక వికెట్ తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి, ఆ సీజన్‌లో ఫైనల్‌లో SRHని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
IPL ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయి టైటిల్ గెలిచిన జట్లు..
IPL 2015 ప్రారంభ మ్యాచ్‌లో, KKR చేతిలో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అనంతరం ముంబయి అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకుని సీఎస్‌కేను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలాగే ఐపీఎల్ 2020లో కూడా ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ముంబైపై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఆ సీజన్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..