IPL 2023: ఈ సారి టైటిల్ విన్నర్ ఆ జట్టే.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్యం ఇదీ..!
IPL 2023 News Updates: ఐపీఎల్ 16వ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుందన్నది ఉత్కంఠరేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి టైటిల్ విజేత ఎవరన్న విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తన అంచనా వెల్లడించారు.
IPL 2023 Winner Prediction: క్రికెట్ అభిమానులకు ఇక పండగే. అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ ఇవాళ (మార్చి 31,2023) సాయంత్రం ప్రారంభంకానుంది. దేశంలో ఎక్కడ చూసిన ఐపీఎల్ ఫీవర్ తారస్థాయికి చేరుకుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మెగా టోర్నీ ప్రారంభానికి వేదికకానుంది. ఐపీఎల్ 16వ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుందన్నది ఉత్కంఠరేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి టైటిల్ విజేత ఎవరన్న విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తన అంచనా వెల్లడించారు. గత ఏడాది ఫైనల్లో గుజరాత్ టైటాన్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ సారి టైటిట్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
‘ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకోసం అత్రుతగా ఎదురుచూస్తున్నా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా.. మే నెలాఖరులో ఆ జట్టు టైటిల్ అందుకుంటుంది’ అని మైకెల్ వాగన్ ట్వీట్ చేశారు. షేన్ వార్నే కెప్టెన్సీలో 2008లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు రెండేసారి టైటిల్ గెలవలేకపోయింది. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరుకున్న రాజస్థాన్.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో రన్నరప్‌గా నిలిచింది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్ రైజర్స్‌తో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రికెట్ కథనాలు చదవండి..