Video: 27 ఏళ్ల తర్వాత మాజీ ఛాంపియన్ టీంకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్‌ 2023కు అర్హత సాధించడంలో విఫలం..

Sri Lanka Vs New Zealand: ఈ రోజు శ్రీలంక క్రికెట్‌కు చాలా చెడ్డ రోజుగా మిగిలింది. ఎందుకంటే ఈ జట్టు ప్రపంచ కప్‌లో నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత శ్రీలంక ఆట ముగిసినట్లైంది.

Video: 27 ఏళ్ల తర్వాత మాజీ ఛాంపియన్ టీంకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్‌ 2023కు అర్హత సాధించడంలో విఫలం..
Nz Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Mar 31, 2023 | 3:09 PM

ఈ రోజు శ్రీలంక క్రికెట్‌కు చాలా చెడ్డ రోజుగా మిగిలింది. ఎందుకంటే ఈ జట్టు ప్రపంచ కప్‌లో నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత శ్రీలంక ఆట ముగిసింది. ఇప్పుడు ఈ జట్టు ప్రపంచ కప్‌లో ఆడటానికి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ రౌండ్‌ను ఆడవలసి ఉంటుంది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని కివీస్‌ జట్టు 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఇప్పుడు 44 సంవత్సరాలలో మొదటిసారిగా శ్రీలంక ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ఆడవలసి వచ్చింది. శ్రీలంక జట్టు 1996లో ప్రపంచకప్ గెలిచిన తర్వత.. ఇలాంటి చెత్త రోజును ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఏ జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి?

భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా కూడా నేరుగా అర్హత సాధించలేకపోయింది. నేరుగా క్వాలిఫై కావాలంటే నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలవాలి. దీంతో సౌతాఫ్రికా కీలక ఆటగాళ్లందరూ నెదర్లాండ్స్‌తో ఆడటానికి ఇదే కారణంగా నిలిచింది.

ఏ జట్లు క్వాలిఫయర్స్ ఆడాలి?

క్వాలిఫయర్ రౌండ్‌లో నెదర్లాండ్స్, జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ ఇంకా నిర్ణయించబడలేదు. జింబాబ్వేలో జూన్ 18 నుంచి క్వాలిఫయర్స్ రౌండ్ ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్‌లో మొత్తం 10 జట్లు ఆడబోతున్నాయి. అందులో అర్హత సాధించడానికి, ఇక శ్రీలంక జట్టు క్వాలిఫయర్స్‌లో టాప్ 2 లో ఉండాలి. లేదంటే ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సిందే.

న్యూజిలాండ్‌లో శ్రీలంకకు భారీ షాక్..

న్యూజిలాండ్ పర్యటనలో శ్రీలంకకు ఏదీ సరిగ్గా జరగలేదు. ఈ జట్టు వన్డే ప్రపంచ కప్‌కి నేరుగా అర్హతను కోల్పోవడమే కాదు, అంతకు ముందు టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం తర్వాత, ఈ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు ఇప్పుడు ఫైనల్‌లో తలపడనున్నాయి. శ్రీలంక జట్టు టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కోల్పోయింది. వన్డే సిరీస్‌ను కూడా 2-0 తేడాతో కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!