AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MPL: 11 బౌండరీలు, 4 సిక్సర్లు.. టీ20లో తొలి సెంచరీ.. 2 భారీ రికార్డ్‌లు సృష్టించిన అంకిత్..!

Ankit Bawne Century in MPL: 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కొల్హాపూర్ టస్కర్స్ అంకిత్ తుఫాన్ శక్తితో 20 ఓవర్లలో 2 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

MPL: 11 బౌండరీలు, 4 సిక్సర్లు.. టీ20లో తొలి సెంచరీ.. 2 భారీ రికార్డ్‌లు సృష్టించిన అంకిత్..!
Mpl 2023
Venkata Chari
|

Updated on: Jun 19, 2023 | 7:41 AM

Share

జూన్ 17న మహారాష్ట్రలో జరిగిన మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో 30 ఏళ్ల అంకిత్ బావ్నే తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో కొల్హాపూర్ టస్కర్స్ జట్టు తరపున ఆడిన అంకిత్.. రత్నగిరి జెట్స్ జట్టుపై తుఫాన్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రత్నగిరి జెట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జట్టు తరపున ప్రీతమ్ పాటిల్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు.

177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కొల్హాపూర్ టస్కర్స్ అంకిత్ తుఫాన్ శక్తితో 20 ఓవర్లలో 2 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంకిత్ 98 పరుగుల వద్ద ఒక సిక్స్ కొట్టి సెంచరీ థ్రెషోల్డ్ దాటాడు. ఈ సెంచరీ పూర్తి చేసేందుకు అతడు 59 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 11 బౌండరీలు, 4 సిక్సర్లు బాదాడు.

ఇవి కూడా చదవండి

అంకిత్ సెంచరీ పూర్తి చేసిన తర్వత చివరి సిక్స్ బాదేశాడు. అంకిత్ మ్యాచ్ ముగిసే వరకు నాటౌట్‌గా నిలిచి 60 బంతుల్లో మొత్తం 105 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రెండు రికార్డులు సృష్టించాడు. మొదటిది, అతని T20 కెరీర్‌లో ఇది మొదటి సెంచరీ కాగా, రెండవది, ఇది MPL చరిత్రలో నమోదైన మొదటి సెంచరీ.

అంకిత్ బావ్నే ఫస్ట్ క్లాస్ క్రికెట్ విజయాలను పరిశీలిస్తే, బావ్నే ఫస్ట్ క్లాస్ , లిస్ట్ ఎతో కలిపి మొత్తం 32 సెంచరీలు చేశాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో తొలి సెంచరీతో అంకిత్ బావ్నే జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ