Ashes 2023: ‘స్కెచ్ వేసి మరీ ఔట్ చేయడమంటే ఇదేనేమో.. చూసి నేర్చుకో రోహిత్’
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది. తనదైన మార్క్..

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది. తనదైన మార్క్ సారధ్య బాధ్యతలతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు ఈ ఆల్‌రౌండర్. ఎవ్వరూ ఊహించని విధంగా బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో సుమారు 4 రన్‌రేట్‌తో ధీటుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను మ్యాచ్ మొదటి రోజే డిక్లేర్ చేసిన స్టోక్స్.. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌కి బంతిని అప్పజెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంతరం ఫీల్డింగ్‌లో తనదైన మార్క్ చూపిస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్ సెంచరీ హీరోలను, ఉస్మాన్ ఖవాజా ఆటకట్టించాడు.
స్లిప్పుల్లో నలుగురు ఫీల్డర్లు, లెగ్ స్లిప్‌లో మరో ఇద్దరు.. గల్లీలో ఇంకో ఫీల్డర్‌ను పెట్టి.. తన బౌలింగ్‌లోనే.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించాడు స్టోక్స్. అనంతరం మూడో రోజు సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజాకు కూడా ఇదే రీతిలో ఫీల్డ్ సెట్ చేసి.. ఔట్ చేశాడు. ఖవాజా ఎటూ కూడా షాట్ ఆడనివ్వకుండా 30 యార్డ్ సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్స్‌ను సెట్ చేసి.. అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాడు స్టోక్స్. దీంతో వైడ్‌గా వచ్చి.. బంతిని కొట్టబోయిన ఖవాజా ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. స్టోక్స్‌ను చూసి రోహిత్ శర్మ నేర్చుకోవాలంటూ కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్‌ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అలాగే స్టోక్స్ బ్రిలియంట్ కెప్టెన్సీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.
How Ben Stokes set up the field leading to the Khawaja dismissal.
The beauty of Test Cricket. #ENGvsAUS #Ashes23 #Khawaja pic.twitter.com/dCYDXLbf9Y
— Nirmal Jyothi (@majornirmal) June 18, 2023
కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ 393 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండు ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతానికి 2 వికెట్లు నష్టపోయి.. 28 పరుగులు చేసింది.
Let’s talk about this field set-up by Ben Stokes for Usman Khawaja’s dismissal.
BazBall at its full flow!#TheAshes #ENGvsAUS pic.twitter.com/CiKLnK4wqa
— Geo Super (@geosupertv) June 18, 2023
Ben Stokes captaincy masterclass You beauty mahn Guy just forced Khawaja to do something different Whatta captain
— STON.POST (@ston1post) June 18, 2023