IND vs ENG: తన రెండు వికెట్లను అతనికి అంకితం ఇచ్చిన సిరాజ్..! గ్రౌండ్‌లో ప్రత్యేక నంబర్ చూపిస్తూ..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయాన్ని అతను లివర్‌పూల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటాకు అంకితం చేశాడు. జోటా ఇటీవల కారు ప్రమాదంలో మరణించాడు. సిరాజ్ తన రెండు వికెట్లను 20 అని చూపిస్తూ జోటాకు నివాళి అర్పించాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన మియా భాయ్.. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతోనే సరిపెట్టుకున్నాడు. అయితే ఆ రెండు వికెట్లను కూడా ఓ ఆటగాడికి అంకితం ఇచ్చాడు. ఇటీవలె ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లివర్‌పూల్ జట్టుకు ఆడే పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటా జూలై 3న కారు ప్రమాదంలో మరణించాడు. వివాహం అయిన 10 రోజులకే అతను మరణించడం మరింత బాధాకరమైన విషయం.
ఇదే కారు ప్రమాదంలోనే అతని సోదరుడు కూడా మృతి చెందాడు. డియోగో జోటా డిసెంబర్ 4, 1996న పోర్చుగల్‌లోని పోర్టోలో జన్మించాడు. 2014లో పోర్చుగల్ అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఐదేళ్ల తర్వాత 2019లో తను జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జోటా 49 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటిలో మొత్తం 14 గోల్స్ చేశాడు. 2020లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరాడు. ఈ క్లబ్‌తో ఐదేళ్ల కెరీర్‌లో అతను 123 మ్యాచ్‌లు ఆడి, 47 గోల్స్ సాధించాడు. డియోగో ఫార్వర్డ్, లెఫ్ట్ వింగర్ స్థానాల్లో ఆడేవాడు.
అలాంటి ఆటగాడి అకాల మరణంతో మొత్తం క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే సిరాజ్.. ఓ స్టార్ ఫుట్‌బాలర్ మృతి చెందడంతో అతనికి నివాళిగా తన రెండు వికెట్ల ప్రదర్శనను అతనికి అంకితం ఇచ్చాడు. జోటా జెర్సీ నంబర్ 20.. తన రెండు వికెట్లను వేళ్లతో చూపిస్తూ.. పక్కన సున్నా యాడ్ చేశాడు. సిరాజ్‌కు క్రిస్టియానో రొనాల్డొ అంటే చాలా ఇష్టం. అతని సెలబ్రేషన్ కూడా రొనాల్డొ సెలబ్రేషన్స్‌ను పోలి ఉంటుంది.
A gesture beyond the game. A tribute to the #20, Diogo Jota 💙 pic.twitter.com/ovHowgwGQC
— KolkataKnightRiders (@KKRiders) July 11, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




