Mohammed Siraj Birthday: ‘రూ.200 కోసం రుమాలీ రోటీలు కాల్చేవాడిని.. చేతులు కూడా కాలిపోయాయి’: సిరాజ్ ఎమోషనల్

టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 13). ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు సిరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీసీసీఐ కూడా హైదరాబాదీ పేసర్ కు స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే సిరాజ్ కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది.

Mohammed Siraj Birthday: 'రూ.200 కోసం రుమాలీ రోటీలు కాల్చేవాడిని.. చేతులు కూడా కాలిపోయాయి': సిరాజ్ ఎమోషనల్
Mohammed Siraj Family
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2024 | 12:44 PM

టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 13). ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు సిరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీసీసీఐ కూడా హైదరాబాదీ పేసర్ కు స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే సిరాజ్ కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో కారు డ్రైవ్ చేస్తూ కనిపించిన సిరాజ్ జీవితంలో తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి. కాబట్టి ఆయనకు తోడుగా నేను పనికి వెళ్ళేవాడిని. ఒక క్యాటరింగ్ లో చేరాను. అక్కడ రుమాలీ రోటీలు కాల్చేవాడిని. ఈ ప్రయత్నంలో చాలా సార్లు నా చేతులు కాలిపోయాయి. రోజుకు రూ. 200 వస్తే 150 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. మిగతా 50 రూపాయలు నా దగ్గరే ఉంచుకునేవాడిని’ అని ఎమోషనల్ అయ్యాడు సిరాజ్‌.

మహ్మద్ సిరాజ్ గురించి బీసీసీఐ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సిరాజ్ జీవితం చాలా స్ఫూర్తిదాయకమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు .అలాగే అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు మరిన్ని గొప్ప విజయాలు అందించాలంటూ సిరాజ్ కుబర్త్ డే విషెస్ చెబుతున్నారు. మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతను బీసీసీఐ ‘ఏ’ గ్రేడ్ ప్లేయర్ కూడా. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు.

ఇవి కూడా చదవండి

సిరాజ్ కు బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఎమోషనల్ వీడియో..

ఆర్సీబీ బర్త్ డే విషెస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..