AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: విదేశీ కోచ్‌లు, సైన్యంతో శిక్షణ.. బలిచ్చే జంతువులకు భలే ట్రైనింగ్ ఇచ్చారే: పాక్ మాజీ ప్లేయర్

Mohammad Hafeez Trolls: టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ Aలో చేరిన పాకిస్తాన్, టోర్నమెంట్ తదుపరి దశకు వెళ్లడానికి భారతదేశంతో పాటు బలమైన పోటీదారుగా ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్‌లో ఆసియాలోని ఈ రెండు పెద్ద జట్లే కాకుండా అమెరికా, కెనడా, ఐర్లాండ్ వంటి చిన్న జట్లు ఉన్నాయి. కానీ, ఆట ప్రారంభం కాగానే పరిస్థితి మొత్తం మారిపోయింది.

Pakistan: విదేశీ కోచ్‌లు, సైన్యంతో శిక్షణ.. బలిచ్చే జంతువులకు భలే ట్రైనింగ్ ఇచ్చారే: పాక్ మాజీ ప్లేయర్
Pakistan Team Exit
Venkata Chari
|

Updated on: Jun 15, 2024 | 11:52 AM

Share

Mohammad Hafeez Trolls: టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, బాబర్ అజామ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఊహించని షాక్ తగిలింది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంతో అభిమానులు, మద్దతుదారులు, మాజీ క్రికెటర్లు అంతా ఫైర్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి జట్టు ఔట్ అయిన వార్తలపై అధికారిక ఆమోదం లభించిన వెంటనే, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో పాక్ జట్టును లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు బాబర్ అజామ్ లేదా ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ, మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ జట్టును బలి పశువంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ Aలో చేరిన పాకిస్తాన్, టోర్నమెంట్ తదుపరి దశకు వెళ్లడానికి భారతదేశంతో పాటు బలమైన పోటీదారుగా ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్‌లో ఆసియాలోని ఈ రెండు పెద్ద జట్లే కాకుండా అమెరికా, కెనడా, ఐర్లాండ్ వంటి చిన్న జట్లు ఉన్నాయి. కానీ, ఆట ప్రారంభం కాగానే పరిస్థితి మొత్తం మారిపోయింది. టీమ్‌ఇండియాతో పాటు గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8కి అర్హత సాధించిన మరో జట్టు పాకిస్థాన్‌ మాత్రం కాదు. అమెరికా జట్టు పాక్ ప్లేస్ సూపర్ 8 చేరడంతో అంతా షాక్ అయ్యారు.

బాబర్ ఆజం బృందం విఫలం, పాకిస్థాన్‌లో గందరగోళం..

బాబర్ ఆజం కెప్టెన్సీలో 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో అలజడి రేగింది. పాకిస్థాన్‌కు చెందిన వెటరన్ క్రికెటర్లు జట్టుతోపాటు పీసీబీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. మహ్మద్ హఫీజ్ లేదా అహ్మద్ షెహజాద్ అయినా, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో జట్టును లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు.

బాబర్, రిజ్వాన్, షాహీన్.. జట్టు నుంచి తొలగించండి..!

వాతావరణ పరిస్థితులపై ఆధారపడిన జట్ల పరిస్థితి ఇదేనని పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చెప్పుకొచ్చాడు. సూపర్-8కి అమెరికా జట్టు చేరుకుంది. ఇప్పుడు ఎలిమినేట్ అయిన పాక్ జట్టుతో పీసీబీ ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అహ్మద్ షాజాద్ ఇక్కడితో ఆగలేదు. ఓ టీవీ షోలో అతను బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్ వంటి ఆటగాళ్లను జట్టు నుంచి మినహాయించాలని డిమాండ్ చేశాడు. అహ్మద్ షాజాద్ ప్రకారం, వీరంతా క్రికెట్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు అతని ఫామ్ తగ్గుముఖం పట్టింది. ఈ షోలో సెలక్షన్ కమిటీలో భాగమైన వహాబ్ రియాజ్‌ను టార్గెట్ చేశాడు.

బలి పశువులా మారిన పాకిస్థాన్ జట్టు..!

పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రొఫెసర్‌గా పేరుగాంచిన మహ్మద్ హఫీజ్, 2024 టీ20 ప్రపంచ కప్‌లో జరిగిన అవమానం తర్వాత పాకిస్తాన్ జట్టును బలి పశువులా పిలుస్తున్నారు. అతను తన X హ్యాండిల్‌‌లో – బలిచ్చేందుకు జంతువులు సిద్ధంగా ఉన్నాయ్’ అంటూ రాసుకొచ్చాడు.

అయితే, భూమిలో ఏది నాటితే అదే బయటకు వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్థాన్ జట్టును మెరుగుపరిచేందుకు పీసీబీ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. విదేశీ కోచ్‌ల నుంచి సైన్యంలో శిక్షణ పొందే వరకు తెగ ప్రయత్నాలు చేసింది. కానీ, చివరికి పీసీబీ మాత్రం ఏమి పొందలేదు? అంటూ దాని అర్థం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..