AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: అసలే ఓటమి బాధ.. ఆపై ఐసీసీ సీరియస్.. కివీస్ బౌలర్‌కు బిగ్ షాక్..

Tim Southee ICC Code of Conduct: టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది. గత 37 ఏళ్లలో కివీ జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌ దాటలేకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత టోర్నీలో న్యూజిలాండ్ గ్రూప్ సిలో భాగమైంది. ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత ఆఫ్ఘన్ జట్టుపై పపువా న్యూగినియా ఓటమి పాలైన తర్వాత కివీ జట్టుకు సూపర్-8 మార్గం మూసుకుపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పుడు న్యూజిలాండ్‌కు రెట్టింపు దెబ్బ తగిలింది.

T20 World Cup: అసలే ఓటమి బాధ.. ఆపై ఐసీసీ సీరియస్.. కివీస్ బౌలర్‌కు బిగ్ షాక్..
Tim Southee
Venkata Chari
|

Updated on: Jun 15, 2024 | 12:23 PM

Share

Tim Southee ICC Code of Conduct: టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది. గత 37 ఏళ్లలో కివీ జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌ దాటలేకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత టోర్నీలో న్యూజిలాండ్ గ్రూప్ సిలో భాగమైంది. ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత ఆఫ్ఘన్ జట్టుపై పపువా న్యూగినియా ఓటమి పాలైన తర్వాత కివీ జట్టుకు సూపర్-8 మార్గం మూసుకుపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పుడు న్యూజిలాండ్‌కు రెట్టింపు దెబ్బ తగిలింది. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత, ఆ జట్టు వెటరన్ ఆటగాడు టిమ్ సౌథీపై ఐసీసీ ఆగ్రహాం వ్యక్తం చేసింది.

టిమ్ సౌథీని మందలించిన ఐసీసీ..

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ టిమ్ సౌథీని ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దోషిగా నిర్ధారించింది. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1ని ఉల్లంఘించినందుకు ఐసీసీ కూడా అతనిని మందలించింది. గ్రూప్ సీలో జూన్ 13న, వెస్టిండీస్‌తో తలపడిన న్యూజిలాండ్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచ్‌లో సౌదీ సహనం కోల్పోయాడు. ఆ ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఔట్ అయిన తర్వాత మళ్లీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుండగా, సౌదీ ఆగ్రహంతో హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగలగొట్టాడు. దీంతో ఇప్పుడు ఐసీసీ అతనికి ఈ శిక్ష విధించింది.

ఐసీసీ నుంచి ఒక పత్రికా ప్రకటనలో, ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు టిమ్ సౌతీ దోషిగా తేలాడు. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు దుర్వినియోగం చేయడం తప్పు” అంటూ పేర్కొంది.

ఈ ఆరోపణలు సౌదీపై ఆన్-ఫీల్డ్ అంపైర్లు అలెక్స్ వార్ఫ్, అహ్సన్ రజా, థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్ మైఖేల్ గోఫ్ చేశారు. దీంతో టిమ్ సౌదీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడిన తర్వాత, గత 24 నెలల్లో సౌదీ చేసిన మొదటి నేరం ఇది. ICC నిబంధనల ప్రకారం, లెవల్ 1 ఉల్లంఘనలకు కనీస జరిమానాగా మందలింపు, జరిమానాగా మ్యాచ్ ఫీజులో 50 శాతం, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..