Mithali Raj Retirement: మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం..అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన లేడీ మాస్టర్‌ బ్లాస్టర్‌..

Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj) సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు తెలపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని  ప్రకటించింది.

Mithali Raj Retirement: మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం..అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన లేడీ మాస్టర్‌ బ్లాస్టర్‌..
Mithali Raj
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2022 | 4:06 PM

Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj) సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు తెలపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని  ప్రకటించింది. కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించడంతో పాటు అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకుందీ ఈ లేడీ మాస్టర్‌ బ్లాస్టర్‌. ‘కొంతమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల చేతుల్లో భారత జట్టు బలంగా ఉంది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే ఇది కూడా ముగియాలి. ఈ రోజు నేను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను. నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, భారత్‌ను గెలిపించాలనే ఉద్దేశ్యంతో నా అత్యుత్తమమైన ఆటతీరును ప్రదర్శించాను. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఇన్నేళ్లుగా జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై ప్రేమాభిమానాలు చూపారు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీర్వాదం, మద్దతుతో త్వరలోనే నా సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని మిథాలీ ట్విట్టర్‌లో పేర్కొంది.

23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో..

మిథాలీరాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్ లో కి అడుగుపెట్టింది. తొలి వన్డేలోనే సెంచరీ సాధించింది. ఆటతీరుతోనే కాకుండా నాయకత్వ ప్రతిభతో రెండు 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్స్‌ను టీమిండియాను చేర్చింది. అదేవిధంగా 232 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి .. 50.68 సగటుతో 7805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా. అందులో మొత్తం 7 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెరీర్ లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. అందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్‌ స్కోరు 214 పరుగులు. ఇక 89 టీ20 మ్యాచులు ఆడిన లేడీ సచిన్‌ 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read:

Fire breaks: మెట్రో పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం; దాదాపు 100 వాహనాలు బుగ్గిపాలు

Viral Photo: తగ్గేదేలే.! మీకో సవాల్.. ఈ ఫోటోలోని జంతువు ఎక్కడుందో కనిపెడితే మీరే జీనియస్!

Viral Video: చేపలు పట్టుకునేందుకు వల తీస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్!

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?