AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians : హార్దిక్ ఫైర్.. 153 బంతుల తర్వాత బుమ్రా బౌన్స్ బ్యాక్.. ముంబై అదృష్టం ఇలా కలిసొచ్చింది

Mumbai Indians : తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి పవర్‌ప్లేలో షాక్ తగిలినా, నమన్ ధీర్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అసలు ఆట అప్పుడే మొదలైంది. ఒకవైపు తిలక్ వర్మ 22 బంతుల్లో 19 పరుగులు చేసి ఇబ్బంది పడుతున్న తరుణంలో, టైమౌట్ వద్ద హార్దిక్ పాండ్యా వచ్చి ఏదో మంత్రం వేసినట్టు మాట్లాడాడు.

Mumbai Indians : హార్దిక్ ఫైర్.. 153 బంతుల తర్వాత బుమ్రా బౌన్స్ బ్యాక్.. ముంబై అదృష్టం ఇలా కలిసొచ్చింది
Bumrah
Rakesh
|

Updated on: Apr 21, 2026 | 1:22 PM

Share

Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో కుంగిపోయిన ముంబై ఇండియన్స్ (MI) ఎట్టకేలకు విశ్వరూపం చూపించింది. నాలుగు రోజులు.. 519 కిలోమీటర్ల దూరం.. ఈ రెండు సందర్భాల్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాలో రెండు విభిన్న కోణాలు కనిపించాయి. ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి తలదించుకున్న హార్దిక్, ఏప్రిల్ 20న తన పాత అడ్డా అయిన మొతేరా స్టేడియంలో సింహంలా గర్జించాడు. గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, ముంబై ఈజ్ బ్యాక్ అని ప్రపంచానికి చాటిచెప్పాడు.

వరుసగా నాలుగు ఓటములు చూసిన తర్వాత ముంబైలో ఏదో వెలితి కనిపించింది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జట్టులో పలు మార్పులు చేశారు. డానిష్ మాలేవార్, కృష్ణ భగత్ వంటి యువకులకు అవకాశం ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి పవర్‌ప్లేలో షాక్ తగిలినా, నమన్ ధీర్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అసలు ఆట అప్పుడే మొదలైంది. ఒకవైపు తిలక్ వర్మ 22 బంతుల్లో 19 పరుగులు చేసి ఇబ్బంది పడుతున్న తరుణంలో, టైమౌట్ వద్ద హార్దిక్ పాండ్యా వచ్చి ఏదో మంత్రం వేసినట్టు మాట్లాడాడు. అంతే.. ఆ తర్వాత తిలక్ ఆడిన 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. కేవలం 45 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది ముంబై స్కోరును 199 కి చేర్చాడు.

లక్ష్య ఛేదనలో గుజరాత్‌ను ఆరంభం నుంచే ముంబై ఉక్కిరిబిక్కిరి చేసింది. జస్ప్రీత్ బుమ్రా గత సీజన్ ఎలిమినేటర్ నుంచి దాదాపు 153 బంతుల వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ, ఈ మ్యాచ్‌లో తొలి బంతికే సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్వయంగా బౌలింగ్‌కు వచ్చి జోస్ బట్లర్‌ను పెవిలియన్ పంపాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశ్విని కుమార్, శుభ్‌మన్ గిల్ వంటి కీలక వికెట్లతో గుజరాత్ వెన్ను విరిచాడు. మిచెల్ సాంట్నర్, గజన్‌ఫర్ తమ స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు.

ముంబై నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్, తిలక్ వర్మ ఒక్కడు చేసిన స్కోరును కూడా దాటలేకపోయింది. కేవలం 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. సాంట్నర్, ఘజన్‌ఫర్ ఐదు ఓవర్లలో కేవలం 32 పరుగులు ఇచ్చి కీలక వికెట్లు తీశారు. 99 పరుగుల భారీ తేడాతో గెలిచిన ముంబై, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం బ్రాడ్ కాస్టర్స్ ముంబై మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? అని అడిగితే, హార్దిక్ పాండ్యా పెద్ద నవ్వుతో అవును అని సమాధానమిచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ?
శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ?
సచిన్‌ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ స్టార్‌..!
సచిన్‌ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ స్టార్‌..!
మన్ కీ బాత్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు
మన్ కీ బాత్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు
చేతులు కలిపిన BSNL, వోడాఫోన్ ఐడియా..యూజర్లకు అదిరిపోయే న్యూస్
చేతులు కలిపిన BSNL, వోడాఫోన్ ఐడియా..యూజర్లకు అదిరిపోయే న్యూస్
బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. కట్ చేస్తే..
బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. కట్ చేస్తే..
38 మెయిడెన్‌ ఓవర్లు.. 3 ప్రపంచ రికార్డులు.. టీమిండియా పాలిట విలన్
38 మెయిడెన్‌ ఓవర్లు.. 3 ప్రపంచ రికార్డులు.. టీమిండియా పాలిట విలన్
పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు..
పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు..
హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్లమధ్య తేడాలు
హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్లమధ్య తేడాలు
ఒక్క కొమ్మతోనే ఇంట్లో గుత్తులుగా పూసే మందార మొక్క..
ఒక్క కొమ్మతోనే ఇంట్లో గుత్తులుగా పూసే మందార మొక్క..
అయ్యర్‌కు షాక్‌..? తెలుగబ్బాయ్‌ని సిద్ధం చేస్తోన్న టీమిండియా..!
అయ్యర్‌కు షాక్‌..? తెలుగబ్బాయ్‌ని సిద్ధం చేస్తోన్న టీమిండియా..!