Watch Video: రోహిత్ నాటౌట్.. చీటింగ్ చేసిన సంజూ శాంసన్.. ఫైరవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో

MI vs RR: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అందులో ఒకటి, ఇది ఐపీఎల్‌లో 1000వ మ్యాచ్. రెండోది రోహిత్ శర్మ 36వ పుట్టినరోజు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా, ముంబయి కెప్టెన్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తుందని అందరూ ఆశించారు.

Watch Video: రోహిత్ నాటౌట్.. చీటింగ్ చేసిన సంజూ శాంసన్.. ఫైరవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Rohit Sharma Out Video
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2023 | 5:10 AM

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అందులో ఒకటి, ఇది ఐపీఎల్‌లో 1000వ మ్యాచ్. రెండోది రోహిత్ శర్మ 36వ పుట్టినరోజు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా, ముంబయి కెప్టెన్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తుందని అందరూ ఆశించారు. అసలే ముంబై ముందు 213 పరుగుల లక్ష్యం ఉంది. కాబట్టి రోహిత్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ వస్తుందని అనుకున్నారు.

అయితే, రోహిత్ శర్మ కేవలం 3 పరుగులే చేసి సందీప్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం హిట్ మ్యాన్ ఔట్‌ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఔట్‌ కాలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎల్‌ఈడీ స్టంప్‌ల‌పైన ఉంచిన బెయిల్స్‌లో రెడ్ లైట్ వెలగడంతో రోహిత్‌తో సహా వాంఖడే స్టేడియం వద్ద వేలాది మంది ముంబై అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది. అతని బ్యాట్ నుంచి 3 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాచ్‌లో 3 పరుగులు చేసిన తర్వాత సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే, సంజూ శాంసన్‌ చేతి వేలు తగలడంతోనే బెయిల్స్‌ పడిపోయాయని, ఫీల్డ్ అంపైర్ కూడా ఇది గమనించకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

నిశితంగా పరిశీలిస్తే రోహిత్‌ శర్మ ఔట్‌ కాదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. రోహిత్‌ ఔట్‌ కాలేదని, శాంసన్‌ చేతి వేలు తగలడం వల్లే బెయిల్స్‌ పడిపోయాయని, కాగా అదే సమయంలో బాల్ బెయిల్స్‌ను దాటి వెళ్లడం, లైట్స్ వెలగడం కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ గమనించకుండా ఔట్‌గా ప్రకటించాడు.

మ్యాచ్ గురించి మాట్లాడితే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) రాజస్థాన్ రాయల్స్ (RR)పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబైకి చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..