MI vs RR: 1000వాలా మ్యాచ్‌లో రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్ అందించిన టిమ్ డేవిడ్.. 6 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం..
రోహిత్ శర్మ పుట్టినరోజున, ఐపీఎల్ 1,000 వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం టిమ్ డేవిడ్ చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదడంతో ఈ లక్ష్యాన్ని ఈజీగా మార్చేశాడు.
రోహిత్ శర్మ పుట్టినరోజున, ఐపీఎల్ 1,000 వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం టిమ్ డేవిడ్ చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదడంతో ఈ లక్ష్యాన్ని ఈజీగా మార్చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) రాజస్థాన్ రాయల్స్ (RR)పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబైకి చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వాంఖడే స్టేడియంలో 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి. ఇటువంటి పరిస్థితిలో 1000వ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఏదో జరగాల్సి ఉందని అనుకున్నారు. ఇదే క్రమంలో టిమ్ డేవిడ్ తన జట్టు కోసం చేశాడు. ముంబయికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం. అయితే జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫుల్ టాస్‌లు వేయగా, డేవిడ్ మూడింటిని సిక్స్‌లు కొట్టి ముంబైకి నాల్గవ విజయాన్ని అందించాడు. అలాగే ముంబై వరుసగా 2 పరాజయాలకు ముగింపు పలికింది.
Tim David, take a bow ?
What a way to leave Wankhede and Sachin Tendulkar all smiles ?#IPL2023 #TATAIPL #MIvRR #IPL1000 | @mipaltan @timdavid8 pic.twitter.com/evvQRJCEFu
— JioCinema (@JioCinema) April 30, 2023
రెండు జట్ల ప్లేయింగ్-11..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, అర్షద్ ఖాన్ .
ఇంపాక్ట్ ప్లేయర్స్: నేహాల్ వధేరా, రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, అర్జున్ టెండూల్కర్.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ధృవ్ జురెల్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: డోనోవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్ , కుల్దీప్ సేన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..