AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పంత్‌కు రూ.12లక్షలు, దిగ్వేష్‌కు 50 శాతం జరిమానా..వీళ్లు ఏం చేశారంటే?

హోంగ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్‌ ను చిత్తు చేసిన లక్నో సూపర్‌ జైంట్స్‌కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. లక్నో కెప్టెన్ రిషబ్‌ పంత్‌తో పాటు..బౌలర్ దిగ్వేష్ సింగ్‌కు జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు 12 లక్షలు, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1ని ఉల్లంఘించినందుకు దిగ్వేష్‌ సింగ్‌కు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.

IPL 2025: పంత్‌కు రూ.12లక్షలు, దిగ్వేష్‌కు 50 శాతం జరిమానా..వీళ్లు ఏం చేశారంటే?
Bcci Shock To Lsg
Anand T
|

Updated on: Apr 05, 2025 | 3:47 PM

Share

ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో..ఎల్‌ఎస్‌జీ ముంబై ఇండియన్స్‌ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ గెలుపు తర్వాత లక్నోకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ఇదే అతనికి మొదటి నేరం కావడంతో, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కోంది. కాగా ఐపీఎల్ 2025లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడవ కెప్టెన్‌ రిషబ్ పంత్. ఇప్పటి వరకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, రియాన్‌ పరాగ్‌కు బీసీసీఐ జరిమానా విధించింది.

మరోవైపు, లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీకి వరుసగా రెండో సారి బీసీసీఐ జరిమానా విధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్ నమన్ ధీర్‌ను.. దిగ్వేష్ సింగ్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ పడగానే దిగ్వేష్ తన స్టయిల్‌లో నోట్ బుక్‌లో లెక్కలు రాసుకుంటూ సెలబ్రేషన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1ని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. ఈ సీజన్‌లో దిగ్వేష్‌కు ఇది రెండో జరిమానా.. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే తప్పు చేసినందుకు బీసీసీఐ అతనికి జరిమానా విధించింది. దీంతో దిగ్వేష్‌కు బీసీసీఐ 3 డీమెరిట్‌ పాయింట్లను కేటాయించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వగా..ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జరిమానా కారణంగా మరో రెండు డీమెరిట్‌ పాయింట్లను యాడ్ చేసింది. దీంతో దిగ్వేష్ ఖాతాలో ప్రస్తుతం 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..