Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2025: లివింగ్ స్టోన్‌‌కు భారీ ధర..ఏ టీమ్ దక్కించుకుందంటే?

Liam Livingstone IPL 2025 Auction Price: ఐపీఎల్ 2025 మెగా వేలంలో లివింగ్ స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు ఆర్సీబీ కోనుగోలు చేసింది.

IPL Auction 2025: లివింగ్ స్టోన్‌‌కు భారీ ధర..ఏ టీమ్ దక్కించుకుందంటే?
Liam Livingstone
Follow us
Venkata Chari

| Edited By: TV9 Telugu

Updated on: Nov 25, 2024 | 12:08 PM

ఐపీఎల్ 2025 మెగా వేలంలో లివింగ్ స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు ఆర్సీబీ కోనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్‌ టీమ్‌లో ఈసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రికీ పాంటింగ్ కొత్త కోచ్‌గా చేరాడు. కోచింగ్ టీమ్‌లోనూ కొత్త వాళ్లు చేరారు. ఇక రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది పంజాబ్ ప్రాంఛైజీ. అదే సమంయలో మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అత్యధిక పర్స్‌ను దక్కించుకుంది. ఆ జట్టు ప్రధాన దృష్టి లియామ్ లివింగ్‌స్టోన్ పైనే ఉంది. అతను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 39 మ్యాచ్‌లు ఆడాడు. 6 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ దాదాపు 163. ఇక లియామ్ లివింగ్‌స్టోన్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీల్లో ఆడిన అనుభవం ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు ఎవరు ఇష్టపడరు! అలా లియామ్ లివింగ్‌స్టోన్ కోరిక 2019లో నెరవేరింది. రాజస్థాన్ రాయల్స్‌లో అవకాశం అతనికి లభించింది. 75 లక్షల రూపాయలకు రాజస్థాన్ లివింగ్ స్టోన్ ను తీసుకుంది. బెన్ స్టోక్స్, బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నారు. ఐపీఎల్‌లోనూ సహచరుడు. లియామ్ లివింగ్‌స్టోన్ తొలిసారిగా ఐపీఎల్ 2019లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది.

పంజాబ్ కింగ్స్‌లో అవకాశం దక్కించుకోవడం ఐపీఎల్‌లో లివింగ్ స్టోన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులు చేశాడు. ఇక గత సీజన్‌లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బ్యాటింగ్ అతని ప్రధాన పాత్ర అయినప్పటికీ, అతను పార్ట్ టైమ్ స్పిన్నర్ గానూ రాణిస్తున్నాడు. లెగ్ స్పిన్, ఆఫ్‌స్పిన్ రెండూ చేయగలడు. ఈసారి పంజాబ్ కింగ్స్ ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో ఎవరికీ చోటు దక్కలేదు. కానీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో లివింగ్ స్టోన్ అనుభవం ఏ జట్టుకైనా ఆస్తి.