ముంబై పై కింగ్స్ విజయం

ముంబై పై కింగ్స్ విజయం

మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మొహాలీలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాగా డికాక్ (60; 39 బంతుల్లో), రోహిత్ శర్మ (32; 18 బంతుల్లో), హార్దిక్ పాండ్య (31; 19 బంతుల్లో) రాణించారు. ఇక […]

Ravi Kiran

|

Mar 31, 2019 | 6:41 AM

మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మొహాలీలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాగా డికాక్ (60; 39 బంతుల్లో), రోహిత్ శర్మ (32; 18 బంతుల్లో), హార్దిక్ పాండ్య (31; 19 బంతుల్లో) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో విల్జోయెన్‌, షమీ, మురుగన్ అశ్విన్ లు రెండేసి వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ జట్టు… మొదటి ముగ్గురు బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోవడంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (40; 24 బంతుల్లో), రాహుల్ (71; 57 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (43; 21 బంతుల్లో)లు మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును అలవోక గా గెలిపించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu