ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ..!

ఢిల్లీ 'సూపర్' విక్టరీ..!

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ సూపర్ ఓవర్ లో కోల్‌కత్తా పై విజయం    పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్ మళ్ళీ చెలరేగిన రసెల్   న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో కోల్‌కత్తా పై ‘సూపర్ ఓవర్’ లో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. […]

Ravi Kiran

|

Mar 31, 2019 | 6:21 AM

  • సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ
  • సూపర్ ఓవర్ లో కోల్‌కత్తా పై విజయం   
  • పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్
  • మళ్ళీ చెలరేగిన రసెల్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో కోల్‌కత్తా పై ‘సూపర్ ఓవర్’ లో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ కార్తీక్ (50; 36 బంతుల్లో), ఆండ్రీ రసెల్ (62; 28 బంతుల్లో) రాణించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో హర్షల్ రెండు వికెట్లు తీయగా, రబడా, సందీప్, మోరిస్, మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.

ఇక అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (99; 55 బంతుల్లో), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43; 32 బంతుల్లో)లు జట్టును దాదాపు గెలుపు తీరాల వరకు తీసుకెళ్లారు. కానీ చివర్లో కోల్‌కత్తా కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది.

సూపర్‌ ఓవర్ సాగింది ఇలా…

►ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ 1, 4, ఔట్‌ (శ్రేయాస్‌), 2, 2, 1లతో మొత్తం 10 పరుగులు సాధించారు.

►రబడా వేసిన ఓవర్‌లో కోల్‌కత్తా 4, 0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు చేసి ఓటమిపాలైంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu