Kuldeep Yadav : క్రికెట్ విమర్శలకు గట్టి సమాధానమిచ్చిన కుల్దీప్..! తానేంటో మరోసారి రుజువు..
Kuldeep Yadav : కొలంబోలో ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ తన పాత రూపాన్ని పరిచయం చేశాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు.
Kuldeep Yadav : కొలంబోలో ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ తన పాత రూపాన్ని పరిచయం చేశాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు. దీంతో అతను విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. శ్రీలంకకు ముందు కుల్దీప్ ఈ ఏడాది మార్చి 26 న ఇంగ్లాండ్‌తో తన చివరి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను 10 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకోలేదు. ఈ కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పటివరకు కుల్దీప్ 64 వన్డేల్లో 107 వికెట్లు సాధించాడు.
ఈ సందర్భంగా కుల్దీప్ మాట్లాడుతూ.. “ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నా పరిమిత ఓవర్ల కెరీర్ ముగిసిందని నేను ఏ సమయంలోనూ భావించలేదు” అని కుల్దీప్ మ్యాచ్ తర్వాత విలేకరులతో అన్నాడు. నేను చాలా మ్యాచ్‌ల్లో నాలుగు, ఐదు వికెట్లు కూడా తీసుకున్నాను. ఒకటి లేదా రెండు పేలవ మ్యాచ్‌లు కెరీర్‌ను అంతం చేయవు. ఒక ఆటగాడిగా ఈ విషయం అందరు తెలుసుకుంటారన నేను అనుకుంటున్నాను” అని తెలిపాడు.
అంతేకాకుండా ” మొదటి వన్డేకు ముందు తాను ఒత్తిడికి లోనయ్యాననీ కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దానిని అధిగమించడానికి సహాయం చేశాడని కుల్దీప్ తెలిపాడు. రాహుల్ సార్ నన్ను ప్రోత్సహించారు. అతను ఆటను ఆస్వాదించమని చెప్పాడు అది పని చేసినందుకు నేను సంతోషిస్తున్నాను” కుల్దీప్ చెప్పాడు. ఆదివారం ఆడిన తొలి వన్డేలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 262 పరుగులు చేసింది. మూడు వికెట్ల నష్టానికి భారత్ 36.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయంగా 86 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 59 పరుగులు చేశాడు. కుల్దీప్ రెండు వికెట్లు సాధించాడు.