21 నిమిషాలు.. 27 బంతులు.. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో సెంచరీ.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్..

On This Day In Cricket: గతేడాది భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా బ్యాట్స్‌మన్ పుజారా స్లో బ్యాటింగ్‌తో చాలా విమర్శల పాలైంది.

21 నిమిషాలు.. 27 బంతులు.. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో సెంచరీ.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్..
representational image
Follow us

|

Updated on: Jul 19, 2021 | 1:59 PM

On This Day In Cricket: గతేడాది భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా బ్యాట్స్‌మన్ పుజారా స్లో బ్యాటింగ్‌తో చాలా విమర్శల పాలైంది. చాలా ఇన్నింగ్స్‌లలో, పూజారా ఖాతా తెరిచేందుకు 20 నుంచి 25 బంతులు లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలు క్రీజులు ఉండిపోతాడు. కానీ, ఒక బ్యాట్స్ మెన్ తన పరుగుల ఖాతాను తెరిచేలోపు అవతలి ఎండ్‌ ఉన్న బ్యాట్స్ మెన్ సెంచరీ సాధించాడు. అవతలి ఎండ్ బ్యాట్స్ మెన్ కేవలం 21 నిమిషాల ఆటతో 27 బంతుల్లో విధ్వంసక సెంచరీ సాధించి చారిత్రాత్మక రికార్డు నెలకొల్పాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి, బైలర్లపై దాడి చేశాడు.

గ్లెన్ చాపెల్.. జులై 19న సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ 1993 లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో గ్లామోర్గాన్‌తో జరిగింది. చాపెల్ లాంక్షైర్ తరపున ఆడాడు. చాపెల్ కేవలం 21 నిమిషాల్లో 27 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో వేగవంతమైన ఫస్ట్-క్లాస్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఇద్దరు గ్లామోర్గాన్ బౌలర్ల పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. వీరిలో టోనీ కోట్ కేవలం 6 ఓవర్లలో 121 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్ మాథ్యూ మేనార్డ్ 6 ఓవర్లలో 110 పరుగులు ఇచ్చాడు. అయితే ఒక వికెట్ మాత్రం దక్కించుకున్నాడు. దీంతో లాంకషైర్ 12 ఓవర్లలో 235 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో చాపెల్ 109 పరుగులు చేశాడు.

8 వేలకు పైగా పరుగులు, 985 వికెట్లు ఇంగ్లండ్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గ్లెన్ చాపెల్ జాతీయ జట్టు తరఫున 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇందులో అతను 14 పరుగులు చేశాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఫస్ట్ క్లాస్‌లో మాత్రం రికార్డులు నెలకొల్పాడు. గ్లెన్ 315 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 436 ఇన్నింగ్స్‌లలో 24.16 సగటుతో 8725 పరుగులు చేశాడు. 75 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 155 పరుగులు. ఇందులో 6 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 985 వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. 283 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో అతను 17.77 సగటుతో 2062 పరుగులు చేశాడు. తొమ్మిది అర్ధ శతకాలు ఇందులో ఉన్నాయి. లిస్ట్ ఏలో అత్యధిక స్కోరు 81 నాటౌట్ గా అతని పేరుపై ఉంది. అలాగే 320 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు.

Also Read:

India vs England: ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు టీమిండియా ఫ్లాప్ షో.. 58 పరుగులకే చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్లు!

T20 Blast: 37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

IND vs SL: టీమిండియా కుర్రాళ్ల దెబ్బకు సోషల్ మీడియా షేక్.. మీమ్స్‌తో నెటిజన్ల ఫెస్ట్!