Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు టీమిండియా ఫ్లాప్ షో.. 58 పరుగులకే చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్లు!

ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన ఓ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగింసింది. 1952 జులై 17 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ జులై 19న ముగిసింది.

India vs England: ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు టీమిండియా ఫ్లాప్ షో.. 58 పరుగులకే చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్లు!
India Vs England
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2021 | 1:40 PM

రెండు ఇన్నింగ్స్‌లలోనూ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఎందరో అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్‌లు జట్టులో ఉన్నా.. అలా పెవిలియన్ చేరడం మాత్రం క్రికెట్ ప్రేమికులు జీర్ణం చేసుకోలేకపోయారు. టీమిండియా కేవలం 58 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమాన్.. భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపి, ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశాడు. 1952 జులై 17 నుంచి 19 వరకు మాంచెస్టర్లో ఈ మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 347 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్, ఓపెనర్ లియోనార్డ్ హట్టన్ 104 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ గాడ్‌ఫ్రే ఎవాన్స్ 71 పరుగులు చేయగా, పీటర్ మే 69 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో రమేష్ దివేచా, గులాం అహ్మద్ తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 21.4 ఓవర్లలో 58 పరుగులకే పెవిలియన్ చేరింది. ఇందులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే డబుల్ డిజిట్ చేరుకోగలిగారు. విజయ్ మంజ్రేకర్ 22, కెప్టెన్ విజయ్ హజారే 16 పరుగులు మాత్రమే చేశారు. ఇంగ్లండ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమాన్ 8.4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ అలెక్ బెడ్సర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇంగ్లండ్ 207 పరుగుల తేడాతో.. మొదటి ఇన్నింగ్స్ ఫ్లాప్ షోతో బోల్తా పడిన భారత జట్టు.. ఫాలో-ఆన్ ఆడింది. రెండవ ఇన్నింగ్స్‌లో రాణిస్తారనుకున్న భారత్ బ్యాట్స్ మెన్స్.. తొలి ఇన్నింగ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఆడారు. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో ఈసారి 36.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 82 పరుగులు సాధించారు. రెండవ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇందులో హేము అధికారి 27, విజయ్ హజారే 16, ఖోఖాన్ సేన్ 13 * పరుగులు సాధించారు. ట్రూమాన్ ఈసారి ఒక వికెట్ మాత్రమే తీశాడు. మరో బౌలర్ బెడ్సర్ ఐదు, టోనీ లాక్ నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ 207 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.

603 మ్యాచ్‌ల్లో 9 వేలకు పైగా పరుగులు, 2304 వికెట్లు ఫ్రెడ్ ట్రూమాన్ ఇంగ్లండ్ తరఫున 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 127 ఇన్నింగ్స్‌లలో 307 వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన 119 పరుగులు ఇచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. ఫ్రెడ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు 17 సార్లు పడగొట్టాడు. మూడుసార్లు అతను మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. అలాగే 603 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 2304 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 పరుగులకు ఎనిమిది వికెట్ల ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 126 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 25 సార్లు పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లో 3 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సహాయంతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9231 పరుగులు సాధించాడు. ఫ్రెడ్ 18 లిస్ట్ ఎ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, అందులో అతను 28 వికెట్లు పడగొట్టాడు.

Also Read:

T20 Blast: 37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

Virat Kohli: ఆల్ టైమ్ గ్రేట్ వన్డే జట్టులో కోహ్లీకి చోటివ్వని పాకిస్తాన్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌.. భారత కెప్టెన్‌ను అవమానించాడంటూ ఫ్యాన్స్ మండిపాటు!

IND vs SL: టీమిండియా కుర్రాళ్ల దెబ్బకు సోషల్ మీడియా షేక్.. మీమ్స్‌తో నెటిజన్ల ఫెస్ట్!