Virat Kohli: ఆల్ టైమ్ గ్రేట్ వన్డే జట్టులో కోహ్లీకి చోటివ్వని పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత కెప్టెన్‌ను అవమానించాడంటూ ఫ్యాన్స్ మండిపాటు!
పాకిస్తాన్ మాజీ పేసర్ ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీకి మాత్రం చోటివ్వలేదు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.
పాకిస్తాన్ మాజీ పేసర్ ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీకి మాత్రం చోటివ్వలేదు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్. తాజాగా ఆయన ఆల్‌టైం ఎలెవెన్ వన్డే జట్టును ప్రకటించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ క్రికెటర్లతో వారి డ్రీమ్‌టీం ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్ అక్తర్ తన ఆల్‌టైం ఫేవరెట్ వన్డే జట్టును వెల్లడించాడు. ఈ జట్టులో భారత క్రికెటర్లు సచిన్, ధోనీ, యువరాజ్, కపిల్ దేవ్‌కు మాత్రమే స్థానం కల్పించాడు. రన్ మెషీన్లుగా పేరొందిన టీమిండియా, పాక్ కెప్టెన్లైన కోహ్లీ, బాబర్ ఆజమ్‌కు మాత్రం స్థానం కల్పించకపోవడం గమనార్హం. ఇక ఓపెనర్లుగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు గ్రీనిడ్జ్‌లను పేర్కొన్నాడు. అలాగే వన్ డౌన్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్‌కు చోటిచ్చాడు. నాలుగవ ప్లేస్‌లో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్‌కు చోటిచ్చాడు. ఐదవ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని చేర్చాడు. ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లకు వరుసగా ఆరు, ఏడు స్థానాలకు పరిమితం చేశాడు.
ఎనిమిదవ స్థానంలో పాక్ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్‌ను, తొమ్మిదవ స్థానంలో వకార్ యూనిస్, పదవ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌లకు స్థానం కల్పించాడు. చివరిస్థానంలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు. సారథిగా షేన్ వార్న్‌ని ఎంచుకుని షాకిచ్చాడు. అయితే, అక్తర్ ప్రకటించిన జట్టులో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఆటగాళ్లు లేకపోవడం గమనార్హం.
అక్తర్ ప్రకటించిన టీమ్: గార్డన్ గ్రీనిడ్జ్, సచిన్ టెండూల్కర్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, ఎంఎస్ ధోనీ (కీపర్), ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, కపిల్ దేవ్, షేన్ వార్న్ (కెప్టెన్)
Also Read:
IND vs SL: టీమిండియా కుర్రాళ్ల దెబ్బకు సోషల్ మీడియా షేక్.. మీమ్స్‌తో నెటిజన్ల ఫెస్ట్!
18 బంతుల్లో 88 పరుగులు.. ఫోర్లు, సిక్సర్ల తుఫాన్ సృష్టించిన ఆస్ట్రేలియా ఆటగాడు..!
ENG vs PAK: భారీ సిక్స్ చూశారా? ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచులో బాదేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్..!