India Vs Srilanka: టీమిండియా ఆల్‌రౌండర్‌కు కరోనా పాజిటివ్.. రెండో టీ20 రేపటికి వాయిదా..

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో కరోనా కలకలం రేగింది. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది..

India Vs Srilanka: టీమిండియా ఆల్‌రౌండర్‌కు కరోనా పాజిటివ్.. రెండో టీ20 రేపటికి వాయిదా..
Krunal Pandya
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 27, 2021 | 4:24 PM

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో కరోనా కలకలం రేగింది. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో మరికాసేపట్లో జరగబోయే రెండో టీ20ను బీసీసీఐ రేపటికి వాయిదా వేసింది. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్ళను ఐసోలేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే ప్లేయర్స్ అందరికీ నెగటివ్ వస్తేనే బుధవారం మ్యాచ్ నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, ప్రస్తుతం భారత్, శ్రీలంక ప్లేయర్స్ అందరూ కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. అటు ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా క్యాంప్‌లో కూడా కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వ‌ృ‌ద్దిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది.

కాగా, మొదటి టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై 38 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ మొత్తమంతా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!