కేవలం 26 నిమిషాలు.. 36 బంతులు.. అంతే సెంచరీ బాదేశాడు..! డేంజర్ బ్యాట్స్‌మెన్..

uppula Raju

uppula Raju |

Updated on: Jul 27, 2021 | 4:16 PM

వన్డేలు, టి 20 క్రికెట్‌లో చాలామంది బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. కానీ ఇటువంటి సెంచరీ మాత్రం ఇప్పటివరకు ఎవరు

కేవలం 26 నిమిషాలు.. 36 బంతులు.. అంతే సెంచరీ బాదేశాడు..! డేంజర్ బ్యాట్స్‌మెన్..
Tom Moody

వన్డేలు, టి 20 క్రికెట్‌లో చాలామంది బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. కానీ ఇటువంటి సెంచరీ మాత్రం ఇప్పటివరకు ఎవరు చేయలేకపోయారు. కేవలం ఒక ఆటగాడు 26 నిమిషాలు 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. అదీ ఇదే రోజున అంటే జూలై 27, 1990 న చేశాడు. ఇప్పటికే మీరు ఆ బ్యాట్స్‌మెన్‌ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అతడు ఎవరో కాదు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టామ్‌మూడీ. ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు కేవలం 26 నిమిషాల్లో సెంచరీ చేశాడు. మూడీ అప్పుడు కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్ కోసం ఆడుతున్నాడు. అతను గ్లామోర్గాన్‌ జట్టుపై ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ స్వాన్సీలో జరిగింది. మూడీ 1995 నుంచి 1999 వరకు వోర్సెస్టర్షైర్ జట్టుకు నాయకత్వం వహించాడు.

టామ్ మూడీ అద్భుతమైన ప్రొఫైల్ టామ్‌ మూడీ 9 అక్టోబర్, 1987 న జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుతో అరంగేట్రం చేశాడు. టామ్ మూడీ ఆస్ట్రేలియా తరఫున 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. దీనిలో అతను 32.57 సగటుతో 456 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో మూడీ రెండు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు. అదే సమయంలో 76 వన్డేలలో అతను 23.28 సగటుతో 1211 పరుగులు చేశాడు. అతను వన్డేల్లో సెంచరీ సాధించలేకపోయాడు కానీ పది అర్ధ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడీ వన్డేల్లో 52 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కి పంపించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు సంబంధించినంతవరకు అతను 300 మ్యాచ్‌ల్లో 46.24, 64 సెంచరీల సగటుతో 21001 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 272 పరుగులు. ఈ 300 మ్యాచ్‌ల్లో 361 వికెట్లు తీశాడు. 366 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో మూడీ 18 సెంచరీలు, 1188 పరుగులు 38.82 సగటుతో పాటు 257 వికెట్లు పడగొట్టాడు.

Biodiesel: చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్.. లీటర్‌కు 59 రూపాయలు మాత్రమే.. ఎక్కడ తయారు చేస్తున్నారంటే..

Kadamba Tree : కదంబ చెట్టు ఔషధాల గని.. ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Raj Kundra: రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu