AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: టీ20 సిరీస్‌పై కన్నేసిన శిఖర్ సేన.. ఆ ఇద్దరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చే యోచన?

టీమిండియా రెండో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న శిఖర్ సేన.. టీ20లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి టీ20లో విజయం సాధించి.. రెండో టీ20లో ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.

IND vs SL: టీ20 సిరీస్‌పై కన్నేసిన శిఖర్ సేన.. ఆ ఇద్దరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చే యోచన?
India vs Sri Lanka
Venkata Chari
|

Updated on: Jul 27, 2021 | 2:23 PM

Share

IND vs SL: టీమిండియా రెండో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న శిఖర్ సేన.. టీ20లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి టీ20లో విజయం సాధించి.. రెండో టీ20లో ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. నేడు ప్రేమదాస్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో రెండవ టీ20లో తలపడనుంది. ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌లు రెండవ టీ20లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. లేదంటే టీంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రెండవ టీ20లో విజయం సాధిస్తే.. పృథ్వీ, సూర్యలకు మూడవ టీ20లో విశ్రాంతినిస్తారు. కాగా, ఈ మ్యాచ్‌లో దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఫామ్‌ టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు.

పిచ్, వాతావరణం: వర్షం పడే అవకాశం లేదు. ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది.

మీకు తెలుసా: – శ్రీలంక ఆడిన చివరి ఐదు టీ20 సిరీస్‌లలో ఓడిపోయింది. – 2019 వన్డే ప్రపంచ కప్ నుంచి 28 టీ 20 లో టీమిండియా ఎకానమీ రేటు 8.62 గా ఉంది. – 2017/18 సీజన్ నుంచి సూర్యకుమార్ యాదవ్ 87 టీ 20 ల్లో 38.50 సగటుతో 2772 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 94 నాటౌట్.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్: పృథ్వీ షా, శిఖర్ ధావన్ (కెప్టెన్), సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, అషేన్ బండారా / భానుకా రాజపక్సే, దసున్ షనక (కెప్టెన్), వనిండు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉదనా, దుష్మంత చనాజరా

Also Read: ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్‌కి తొలి పసిడి పతకం.. దేశంలో మార్మోగిపోతున్న ఆమె పేరు

2 పరుగులకు 6 వికెట్లు.. ఆ బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఇంగ్లీష్ ప్లేయర్లు.. జట్టు నుంచి తీసేయాలంటూ నిరసనలు

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్