AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్‌కి తొలి పసిడి పతకం.. దేశంలో మార్మోగిపోతున్న ఆమె పేరు

Tokyo Olympics 2021: మొన్నటి వరకు ఆమె ఓ సాధారణ అథ్లెట్.. ఆదేశంలోనూ ఎక్కువ మందికి ఆమె తెలియదు. టోక్యో ఒలింపిక్స్‌ ఆమె జీవితాన్నే కాదు.. ఒలింపిక్స్‌లో ఫిలిప్ఫిన్స్‌ చరిత్రనే మార్చేసింది. ప్రస్తుతం ఆదేశంలో ఆమె ఓ హాట్‌టాపిక్‌గా మారిపోయారు.

ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్‌కి తొలి పసిడి పతకం.. దేశంలో మార్మోగిపోతున్న ఆమె పేరు
Hidilyn Diaz
Venkata Chari
|

Updated on: Jul 27, 2021 | 1:54 PM

Share

Tokyo Olympics 2021: మొన్నటి వరకు ఆమె ఓ సాధారణ అథ్లెట్.. ఆదేశంలోనూ ఎక్కువ మందికి ఆమె తెలియదు. టోక్యో ఒలింపిక్స్‌ ఆమె జీవితాన్నే కాదు.. ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్‌ చరిత్రనే మార్చేసింది. ప్రస్తుతం ఆదేశంలో ఆమె ఓ హాట్‌టాపిక్‌గా మారిపోయారు. వివరాల్లోకి వెళ్తే..టోక్యో ఒలింపిక్స్‌లో ఫిలిప్ఫిన్స్‌ వెయిట్‌లిఫ్టర్‌ హిడ్లీ డియాజ్‌ సంచలనానికి మారుపేరుగా మారిపోయారు. మహిళల 55 కిలోల విభాగంలో చరిత్ర సృష్టిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది. తన కెరీర్‌లో నాలుగో ఒలింపిక్ గేమ్స్ ఆడిన 30 ఏళ్ల డియాజ్.. ప్రస్తుతం ఆ దేశంలో హాట్ టాపిక్‌గ మారారు. మహిళల 55 కిలోల విభాగంలో ఒలింపిక్‌ రికార్డును సృష్టించి పతకం సాధించింది. మొత్తం 224 కేజీలు ఎత్తి తొలి స్థానంలో నిలిచింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 127 కేజీలు ఎత్తిన డియాజ్.. అంతకుముందు చైనా మహిళ లివో ఒలింపిక్‌ రికార్డును(126 కేజీలు) బద్దలు కొట్టింది. ఫిలిప్ఫీన్స్‌ చరిత్రలో తొలిసారి ఒలింపిక్‌ నుంచి బంగారు పతకాన్ని అందించింది. ఇంతటి ఘనత సాధించిన డియాజ్.. విజేతగా నిలిచిన సందర్భంలో గట్టిగా ఏడ్చేస్తూ కోచ్‌లను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మలేషియాలో శిక్షణ పొందుతున్నప్పుడు కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో కుటుంబానికి దాదాపు ఏడు నెలలు దూరంగా ఉండిపోయింది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ, ‘నా తల్లిని, ఆమె చేతి వంటను చాల మిస్ అవుతున్నాను. కానీ, నా లక్ష్యం కోసం ఇది తప్పదు. ఎలాగైనా టోక్యోలో పతకం సాధింస్తానని’ చెప్పుకొచ్చింది.

ఈ విజయంతో డియాజ్.. 33 మిలియన్ల పెసోలు (సుమారు రూ. 6 కోట్లు) ప్రభుత్వం నుంచే కాక ఆదేశ వ్యాపార వేత్తల నుంచి నగదు బహుమతులు అందుకుంది. అలాగే ఓ ఇంటిని కూడా బహుమతిగా అందుకుంది. డియాజో విజయానికి ఫిలిప్ఫిన్స్‌ దేశం మొత్తం గర్వంగా ఉందని ఆదేశ ప్రతినిధి హ్యరీ రోక్ వెల్లడించాడు.

Also Read: 2 పరుగులకు 6 వికెట్లు.. ఆ బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఇంగ్లీష్ ప్లేయర్లు.. జట్టు నుంచి తీసేయాలంటూ నిరసనలు

Tokyo Olympics 2020: పతకానికి అడుగు దూరం.. అరంగేట్ర ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అరుదైన రికార్డు!

Viral Video: ఇతని ఆటకు లిటిల్ మాస్టర్ ఫిదా.. క్యారమ్స్ ఎలా ఆడుతున్నాడో మీరూ చూడండి..! వైరలవుతోన్న వీడియో

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.