Tokyo Olympics 2020: పతకానికి అడుగు దూరం.. అరంగేట్ర ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అరుదైన రికార్డు!
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టింది. 69కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. అరంగేట్రంలోనే అరుదైన రికార్డును సాధించింది.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టింది. 69కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. జర్మన్ బాక్సర్ నడైన్ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే.. కచ్చితంగా పతకం అందుకోనుంది. ఈ మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకున్న లవ్లీనాకు, తొలిరౌండ్లో బై లభించింది. మంగళవారం భారత్ నుంచి బరిలోకి దిగిన ఏకైక బాక్సర్ లవ్లీనా మాత్రమే. 12 ఏళ్లు అనుభవమున్న జర్మన్ బాక్సర్‌పై తుది వరకు పోరాడింది. ఏదశలోనూ ఒత్తిడికి గురి కాకుండా.. తన గేమ్‌ను అమలు చేసింది. స్వల్పతేడాతో పై విజేతగా నిలిచింది. వీరిద్దరికీ టోక్యో ఒలింపిక్స్ బరిలో తొలిసారి ఆడుతున్నారు. జర్మనీ నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి బాక్సర్‌గా ఆప్టెజ్ రికార్డు నెలకొల్పింది. అలాగే ఆమె రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించింది. భారత బాక్సర్ లవ్లీనాకూ సైతం రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్య పతకాలు గెలుచుకుంది.
తొలిరౌండ్లో దూకుడిగా ఆడిన భారత భాక్సర్.. జర్మన్ ప్లేయర్‌కు ధీటుగానే ఎదురొడ్డింది. లెప్ట్ హుక్స్‌తో పాయింట్లు రాబట్టిన లవ్లీనా.. అప్టెజ్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచులో 28-29, 29-28, 30-27, 30-27, 27-30తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
What a debut by @LovlinaBorgohai! ?
She advances to the last 8th slot after winning 3-2 against Nadine Apetz of #GER in the women’s 69kg welterweight category! ?
Let’s cheer for her, let’s #Cheer4India! ?? @WeAreTeamIndia #Tokyo2020 pic.twitter.com/D8uIxOmdWP
— MyGovIndia (@mygovindia) July 27, 2021
ఫీల్డింగ్‌లో ఇతన్ని ఢీ కొట్టేవారు లేరు.. ‘ఇండియా’ కు తండ్రయ్యాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే.!