AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: హాకీలో టీమిండియా దూకుడు.. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం..!

Tokyo Olympics 2020: స్పెయిన్‌ను 3-0తో ఓడించి భారత పురుషుల హాకీ టీం రెండో విజయాన్ని నమోదు చేసింది. దాంతో క్వార్టర్ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Tokyo Olympics 2020: హాకీలో టీమిండియా దూకుడు.. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం..!
Indian Hockey Team
Venkata Chari
|

Updated on: Jul 27, 2021 | 10:14 AM

Share

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత హాకీ ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. ఈ విషయంలో ఆటగాళ్లు కూడా కలత చెంది ఉంటారు. ఆ కసితో ఈ రోజు ఉదయం స్పెయిన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో అద్భుతంగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. భారత్ 3-0తో స్పెయిన్‌ను ఓడించింది. ఈ విజయంతో పూల్ ఏలో భారత్ స్థానం మరితం మెరుగైంది. ఆస్ట్రేలియా తరువాత పూల్ ఏలో రెండవ స్థానంలో నిలిచింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత ఆటగాళ్లు.. స్పెయిన్‌ జట్టును ఏ మాత్రం కోలుకోనివ్వలేదు. మూడు క్వార్టర్స్‌ ముగిసేసరికి 2-0తో నిలిచిన భారత టీం.. చివరి క్వార్టర్స్‌లో రూపిందర్‌పాల్‌ సింగ్‌ రెండో గోల్‌ చేయడంతో 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం నిర్ణీత సమయంలో స్పెయిన్‌ జట్టు ఎలాంటి గోల్‌ చేయకపోవడంతో టీమిండియా ఘన విజయాన్ని సాధించి, పతక ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. భారత్‌ తరపున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ 2, సింగ్‌ సిమ్రన్‌జిత్‌ ఒక గోల్‌ చేశారు. ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉన్నాయి.

తొలి క్వార్టర్‌లో 2 గోల్స్.. మ్యాచ్‌ తొలి క్వార్టర్‌ 14 వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్‌ తొలి గోల్ చేశాడు. దీంతో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఒలింపిక్స్‌లో సిమ్రన్‌జిత్‌ చేసిన మొదటి గోల్ కూడా ఇదే కావడం విశేషం. అనంతరం భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న రూపీందర్ పాల్ సింగ్.. అద్భుత గోల్‌తో భారత్ 2-0తో ఆధిక్యంలోకి చేరుకుంది.

రెండు, మూడు క్వార్టర్స్‌లో నో గోల్స్.. భారత్, స్పెయిన్ టీంలు రెండు, మూడు క్వార్టర్స్‌లో గోల్స్ చేయలేదు. రెండు జట్టు దూకుడుగా తలపడ్డాయి. స్పెయిన్‌ జట్టుకు పెనాల్టీలు లభించినా వాటిని గోల్స్‌గా మలచడంలో ఆ జట్టు విఫలమైంది. భారత జట్టు 2-0 తేడాతో కొనసాగింది.

నాలుగో క్వార్టర్‌లో టీమిండియా దూకుడు పెనాల్టీలను స్కోర్లుగా మలిచే అవకాశాన్ని స్పెయిన్ కోల్పోయింది. కానీ, పెనాల్టీ కార్నర్‌లో గోల్ సాధించే అవకాశాన్ని భారత్ వదిలిపెట్టలేదు. మ్యాచ్ 51 వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ అద్భుతంగా గోల్ చేశాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యం సాధించి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్స్, పెనాల్టీ స్ట్రోక్స్, ఫీల్డ్ గోల్స్ సాధించడం విశేషం.

Also Read: Mirabai Chanu: ‘ఈ పతకం దేశ ప్రజలకు అంకితం.. వారి సహాయం లేకుంటే విజయం కఠినమయ్యేది’

Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?