Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను సోమవారం భారత్‌ చేరుకుంది. దాంతో విమానాశ్రయం నుంచి మీరాబాయి చానుకి ఊహించని స్వాగతం లభించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మీరాబాయి చాను 49 కిలోల పోటీల్లో రజత పతకం సాధించింది.

Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే
Meerabai chaanu
Follow us
Venkata Chari

|

Updated on: Jul 27, 2021 | 9:01 AM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను సోమవారం భారత్‌ చేరుకుంది. దాంతో విమానాశ్రయం నుంచి మీరాబాయి చానుకి ఊహించని స్వాగతం లభించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మీరాబాయి చాను 49 కిలోల పోటీల్లో రజత పతకం సాధించింది. 202 కిలోల బరువును ఎత్తి ఈ ఫీట్ సాధించింది. మీరాబాయి స్నాచ్ రౌండ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోలు ఎత్తి రెండవ రౌండ్‌లో నిలిచింది. ఈమేరకు ఆమెను భారతీయ రైల్వే ఘనంగా సన్మానించి, బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెను సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఈమేరకు ఆయన మాట్లాడుతూ, మీరాబాయి చాను దేశానికి గర్వకారణమైందని, తమ ఉద్యోగి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే రైల్వే నుంచి రూ. 2 కోట్లతో పాటు ప్రమోషన్‌ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రతిభ, కృషితో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అంతకుముందు మీరాబాయి చానును క్రీడా మంత్రిత్వ శాఖ కూడా సత్కరించింది. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్, మాజీ క్రీడా మంత్రి కిరెన్ రిజిజు, సర్బానంద సోనోవాల్, జి. కృష్ణారెడ్డితోపాటు ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

టోక్యోలో విజయం సాధించినందుకు సహాయం చేసిన క్రీడా మంత్రిత్వ శాఖకు, ప్రధాని నరేంద్ర మోడీకి మీరాబాయి చాను ధన్యవాదాలు తెలియజేశారు. ఈమేరకు ఆమె మాట్లాడుతూ, ‘ప్రధాని మోడీకి, క్రీడా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ సమయంలో నన్ను ప్రాక్టీస్ కోసం అమెరికాకు పంపించారు. ఒక్క రోజులోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో నాకు మంచి శిక్షణ లభించింది. అలాంటి కఠిన శిక్షణతోనే నేను పతకం సాధించానని’ ఆమె తెలిపింది. రజత పతక విజేత మీరాబాయి చానును మణిపూర్ రాష్ట్ర పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమిస్తామని మణిపూర్ సీఎం ఎన్. బిరెన్ సింగ్ సోమవారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపునుంచి కోటి రూపాయల బహుమతిని కూడా అందిస్తుందని సీఎం తెలిపారు.

Also Read: Tokyo Olympics 2020 Live: స్పెయిన్‌పై 3-0 తేడాతో భారత హాకీ జట్టు విజయం

వరుసగా 8 ఓవర్లు మెయిడిన్ చేసిన ‘ది గ్రేట్ బౌలర్’..! వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన రికార్డ్..

Tokyo Olympics 2020: మను బాకర్-సౌరభ్ చౌదరి, శరత్ కమల్ పైనే అందరి దృష్టి.. కీలకపోరులో నేడు బరిలోకి

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్