Tokyo Olympics 2020: మను బాకర్-సౌరభ్ చౌదరి, శరత్ కమల్ పైనే అందరి దృష్టి.. కీలకపోరులో నేడు బరిలోకి
భారత్ ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ -2020 లో కేవలం ఒకే పతకం సాధించింది. ఈ రోజు పతకాల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. దీంతో ఈ రోజు మను బాకర్-సౌరభ్ చౌదరి జోడీపై చాలా అంచనాలు ఉన్నాయి.
Tokyo Olympics 2020: ఈ రోజు టోక్యో ఒలింపిక్స్ -2020 లో భారతదేశం పతకాల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని ఆశపడుతోంది. ఇద్దరు యువ ఆటగాళ్లు మను భాకర్-సౌరభ్ చౌదరి జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ పతక పోటీదారులుగా బరిలోకి దిగనున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లో పోటీపడతారు. అదే సమయంలో, టేబుల్ టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో అనుభవజ్ఞుడైన క్రీడాకారుడు అచంత శరత్ కమల్‌పై కూడా అందరి దృష్టి ఉంటుంది. ఐదవ రోజు టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు షెడ్యూల్ ఇలా ఉంది.
టోక్యో ఒలింపిక్స్ -2020 కోసం భారత షెడ్యూల్ జులై 27 (భారత కాలమానం ప్రకారం) షూటింగ్ ఉదయం 5:30 – 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం క్వాలిఫికేషన్ స్టేజ్ -1, మను బాకర్-సౌరభ్ చౌదరి, యశస్విని దేస్వాల్-అభిషేక్ వర్మ ఉదయం 6:15 – క్వాలిఫికేషన్ స్టేజ్ -2 ఉదయం 7:30 మెడల్ రౌండ్
ఉదయం 9:45 – 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం క్వాలిఫికేషన్ స్టేజ్ -1 (ఎలవెనిల్ వలరివన్-దివ్యాన్ష్ సింగ్ పన్వర్, అంజుమ్ ముడ్గిల్- దీపక్ కుమార్) ఉదయం 10:30 – స్టేజ్ -2 ఉదయం 11:45 గంటలకు – మెడల్ రౌండ్
హాకీ ఉదయం 6:30 – ఇండియా వర్సెస్ స్పెయిన్ (పురుషుల టీమ్ పూల్ ఎ మ్యాచ్)
బ్యాడ్మింటన్ ఉదయం 8:30 – పురుషుల డబుల్స్ గ్రూప్ ఈవెంట్ (సాత్విక్‌సైరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి vs బెన్ లేన్ -సీన్ వెండి (యూకే జోడీ))
టేబుల్ టెన్నిస్ ఉదయం 8:30 – అచంత శరత్ కమల్ వర్సెస్ మా లాంగ్ (చైనా), పురుషుల సింగిల్స్ మూడవ రౌండ్
సెయిలింగ్: ఉదయం 8:35 – నేత్రా కుమనన్, మహిళల లేజర్ రేడియల్. ఉదయం 8:45 – విష్ణు శరవణన్, పురుషుల లేజర్ రేడియల్. ఉదయం 11:20 – కేసీ గణపతి-వరుణ్ ఠక్కర్, పురుషుల స్కిఫ్ 49 ఇఆర్
బాక్సింగ్ ఉదయం 10:57: లోవ్లినా బోర్గేహన్ వర్సెస్ అపెట్జ్ నెడిన్ (మహిళల 69 కిలోలు, రౌండ్ -16)
Also Read: Tokyo Olympics 2020 Live: మను, సౌరభ్‌ల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ప్రారంభం
Tokyo Olympics 2020 Highlights: మహిళల హాకీ: జర్మనీ చేతిలో 2-0తో భారత్ ఓటమి..