AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MiraBai: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీరాబాయి చానుకి ఘనస్వాగతం.. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి

టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ కొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది.

MiraBai: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీరాబాయి చానుకి ఘనస్వాగతం.. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి
Mirabai Chanu
Balaraju Goud
|

Updated on: Jul 26, 2021 | 6:12 PM

Share

Olympic silver-medallist Mirabai Chanu returns: టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ కొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ అధికారులు మీరాబాయికి ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ భారత్‌ మాతాకీ జై నినాదాలతో మారుమోగింది. భారీగా తరలివచ్చిన క్రీడాభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టోక్యో నుంచి తిరిగివచ్చిన మీరాబాయి ప్రోటోకాల్ ప్రకారం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేసుకున్నారు.

ఇదిలావుంటే, 21 ఏళ్ల తరువాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్‌ మెడల్ లభించింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించాలంటే ఎంతో కష్టపడాలన్నారు మీరాబాయి. ఐదేళ్ల నుంచి ఎన్నో త్యాగాలు చేయడం వల్లే తనకు సిల్వర్‌ పతకం లభించిందన్నారు. భారత ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాళ్ల ఆశలను సజీవం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు గోల్డ్‌ దక్కనుందా ? ఆ పోటీలో స్వర్ణపతకం గెలిచిన చైనా వెయిట్‌లిఫ్టర్‌ హు జిహుయికి మరోసారి డోప్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డోప్‌ పరీక్షలలో హు జిహుయి విఫలమైతే భారత్‌కు బంగారు పతకం దక్కినట్టే.

మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన అథ్లెట్‌. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో ఆమె రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించింది. అనూహ్య పరిణామాలు జరిగితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి అప్‌గ్రేడ్‌ కానుంది. 49 కిలోల పోటీల్లో చైనా క్రీడాకారిణి హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది.

కొన్ని కారణాల వల్ల హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్‌ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు మరోసారి డోప్‌ పరీక్షలు చేయబోతున్నారు. ఒకవేళ ఆ పరీక్షల్లో ఆమె విఫలమైతే మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి అప్‌డేట్‌ చేస్తారు. కాగా, భారత్ చేరిన మీరాబాయి చానుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Read Also…  Viral Video: మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..