Viral Video: మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

'వెనమ్'.. ఇది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. 'స్పైడర్‌మాన్' సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ 'వెనమ్' ఫేవరెట్. నల్లటి ఆకారంతో రాక్షసి..

Viral Video: మీరెప్పుడైనా 'వెనమ్'ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!
Crab Hunt
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2021 | 5:28 PM

‘వెనమ్’.. ఇది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘స్పైడర్‌మాన్’ సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ ‘వెనమ్’ ఫేవరెట్. నల్లటి ఆకారంతో రాక్షసి బల్లిలాగే ఉండే ఈ ‘వెనమ్’‌కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. సాధారణంగా సినిమాల్లోని ‘వెనమ్’ ఫైట్ చేసిన ప్రతీసారి మనుషులను తినేస్తుందని చూపించారు. అయితే అదంతా రీల్.. కానీ మీరెప్పుడైనా ‘వెనమ్’‌ను రియల్‌గా చూశారా.? అది వేటాడటం చూసి ఆశ్చర్యపోయారా.? అయితే ఈ వీడియో మీకోసమే.! రియల్ ‘వెనమ్’‌పై ఓ లుక్కేయండి..

చూశారా.! పీతను ‘వెనమ్’ లాంటి ఈ వింత జంతువు ఎలా వేటాడుతోందో.? చూడటానికి కొంచెం ఆశ్చర్యంగా.. మరికొంచెం గగుర్పాటుకు గురి చేసే విధంగా ఉంది కదా ఈ వీడియో! ‘వెనమ్’లా కనిపించే ఈ జంతువును మెరైన్ ఫ్లాట్‌వారమ్ అని అంటారు. ఇవి అరుదైన జాతికి చెందిన జీవులు. ఎక్కువగా సముద్రపు అంచుల, పగడపు దిబ్బలలో కనిపిస్తుంటాయి. మంచి నీటి ఆవాసాలలో ఇవి కనిపించడం అరుదు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాన్ని చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.